Covid-19 Delta variant: కొవిడ్-19 డెల్టా వేరియంట్ ప్రభావం 85దేశాల్లో ఉంది – WHO

గతంలో కంటే వేగంగా వ్యాప్తి చెందే డెల్టా వేరియంట్.. ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే మరింత ప్రమాదకరంగా మారతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో వైరస్ ఆనవాళ్లు గుర్తించినట్లు వెల్లడించింది.

Covid-19 Delta variant: కొవిడ్-19 డెల్టా వేరియంట్ ప్రభావం 85దేశాల్లో ఉంది – WHO

Who

Updated On : June 25, 2021 / 11:14 AM IST

Covid-19 Delta variant: గతంలో కంటే వేగంగా వ్యాప్తి చెందే డెల్టా వేరియంట్.. ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే మరింత ప్రమాదకరంగా మారతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో వైరస్ ఆనవాళ్లు గుర్తించినట్లు వెల్లడించింది. జూన్ 22వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఆల్ఫా వేరియంట్ 170దేశాల్లో కనిపించింది.

బీటా వేరియంట్ 119దేశాల్లో కనిపించగా, గామా 71దేశాల్లో, డెల్టా 85దేశాల్లో సజీవంగా ఉందని తెలిసింది. ‘ డెల్టా వేరియంట్ అనేది 85దేశాల్లో కనిపించింది. డబ్ల్యూహెచ్ఓ సభ్యత్వ దేశాల్లో కేసుల నమోదు కొనసాగుతూనే ఉంది. రెండు వారాల్లో 11మందికి వచ్చినట్లుగా తెలిసింది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టేట్మెంట్ ఇచ్చింది.

ప్రస్తుతం ఉన్న నాలుగు వేరియంట్లపై ఫోకస్ పెట్టాం. ఆల్ఫా, బీటా, గామా, డెల్టాలు డబ్ల్యూహెచ్ఓ దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వేరియంట్ ఆల్ఫా వేరియంట్ కంటే వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే తీవ్రత బాగా కనిపిస్తుంది.

యూరోపియన్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో భాగంగా డెన్మార్క్.. బెల్జియంల మధ్య జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ తర్వాత ముగ్గురికి కరోనా పాజిటివ్ రాగా వారికి డెల్టా వేరియంట్ సోకినట్లు తెలిసింది.

బ్రెజిల్ లో ప్రస్తుతం రికార్డు స్థాయిలో కొవిడ్ ఇన్ఫెక్షన్లు కొనసాగుతున్నాయి. బుధవారానికి గడిచిన 24గంటల్లో లక్షా 15వేల 228కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ చెపపింది. అదే సమయంలో 2వేల 392మంది చనిపోయారు కూడా.