Home » DSP Sunil Kumar
గంజాయి స్మగ్లర్ కారులో షికారు చేసిన అనకాపల్లి డీఎస్పీ సునీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సీజ్ చేసిన కారులో డీఎస్పీ షికారుపై పోలీసుల విచారణ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే డీజీపీకి అనకాపల్లి ఎస్పీ గౌతమీచారి నివేదిక ఇచ్చారు.
అనకాపల్లిలో పోలీస్ ఆఫీసర్ నిబంధనలకు పాతరేశారు. సీజ్ చేసిన కారును రోడ్డెక్కించారు. ఎవరికి తెలియకుండా ఉండేందుకు కారు నెంబర్ ప్లేట్ మార్చేసి మరీ తిరిగారు. చివరికి యాక్సిడెంట్ అవ్వడంతో కారు ఎవరిదని ఆరా తీస్తే అసలు అప్పుడు వెలుగు చూసింది.