Anakapalli DSP Sunil Kumar : గంజాయి కేసులో పట్టుబడిన కారులో డీఎస్పీ షికారు.. నెంబర్ ప్లేట్ మార్చి కుటుంబసభ్యులతో విహారం

అనకాపల్లిలో పోలీస్ ఆఫీసర్ నిబంధనలకు పాతరేశారు. సీజ్ చేసిన కారును రోడ్డెక్కించారు. ఎవరికి తెలియకుండా ఉండేందుకు కారు నెంబర్ ప్లేట్ మార్చేసి మరీ తిరిగారు. చివరికి యాక్సిడెంట్ అవ్వడంతో కారు ఎవరిదని ఆరా తీస్తే అసలు అప్పుడు వెలుగు చూసింది.

Anakapalli DSP Sunil Kumar : గంజాయి కేసులో పట్టుబడిన కారులో డీఎస్పీ షికారు.. నెంబర్ ప్లేట్ మార్చి కుటుంబసభ్యులతో విహారం

DSP Sunil Kumar

Updated On : February 12, 2023 / 2:15 PM IST

Anakapalli DSP Sunil Kumar : అనకాపల్లిలో పోలీస్ ఆఫీసర్ నిబంధనలకు పాతరేశారు. సీజ్ చేసిన కారును రోడ్డెక్కించారు. ఎవరికి తెలియకుండా ఉండేందుకు కారు నెంబర్ ప్లేట్ మార్చేసి మరీ తిరిగారు. చివరికి యాక్సిడెంట్ అవ్వడంతో కారు ఎవరిదని ఆరా తీస్తే అసలు అప్పుడు వెలుగు చూసింది. దీంతో అనకాపల్లి డీఎస్పీ సునీల్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు.

గంజాయి కేసులో పట్టుబడ్డ కారులో అనకాపల్లి డీఎస్పీ సునీల్ కుమార్ షికారు చేశారు. కారు నెంబర్ ప్లేట్ ను కూడా మార్చేసి కుటుంబ సభ్యులతో కలిసి విహరించారు. లగ్జరీ కారులో జోరుగా దూసుకుపోతున్న సమయంలో మరో కారును ఢీకొట్టారు. దీంతో సీజ్ చేసిన కారు రోడ్డెక్కించడం, అదీ కూడా నెంబర్ ప్లేట్ మార్చడం ఇవన్నీ బహిర్గతమయ్యాయి.

నంబర్ ప్లేట్‌పై సీఎం జగన్ పేరు: కారు సీజ్ చేసిన పోలీసులు

గంజాయి కేసులో పట్టుబడ్డ వాహనాన్నీ డీఎస్సీ సునీల్ కుమార్ తన సొంత అవసరాలకు వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై డీజీపీకి అనకాపల్లి ఎస్పీ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.