Home » ENG VS AUS 1st Test
తొలి ఇన్నింగ్స్‌లో త్వరగా డిక్లేర్డ్ చేయడంపై చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ నిర్ణయం వల్లనే ఓడిపోయామని అంటున్నారు. అయితే, వారికి నేను ఒక్కటే చెప్పదల్చుకున్నా.. అంటూ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఐదో రోజు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. నువ్వానేనా అన్నట్లు ఇరు జట్లు చివరి వరకు పోరాడాయి. చివరికి ఆసీస్ జట్టు విజేతగా నిలిచింది. ఇంగ్లాండ్ ‘బజ్‌బాల్’ క్రికెట్ వల్లే ఓడిందనే వాదన సర్వత్రా వినిపిస్తోంది.
యాషెస్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముందు 281 పరుగుల లక్ష్యం నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 273 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
అందరిలా తాము కాదంటూ ఇంగ్లాండ్ జట్టు టెస్టుల్లో బజ్‌బాల్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. మొదటి టెస్టు తొలి రోజే 393-8 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది