ENG VS AUS Ashes : ఆస్ట్రేలియా విజ‌య ల‌క్ష్యం 281.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 273 ఆలౌట్‌

యాషెస్ సిరీస్‌లో భాగంగా జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముందు 281 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 273 ప‌రుగులకు ఆలౌట్ అయ్యింది.

ENG VS AUS Ashes : ఆస్ట్రేలియా విజ‌య ల‌క్ష్యం 281.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 273 ఆలౌట్‌

Australia

ENG VS AUS : యాషెస్ సిరీస్‌లో భాగంగా జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముందు 281 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 273 ప‌రుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లీష్ బ్యాట‌ర్ల‌లో రూట్ (46), హ్యారీ బ్రూక్ (46), బెన్ స్టోక్స్ (43) లు రాణించారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో క‌మిన్స్‌, నాథ‌న్ లియోన్‌లు చెరో నాలుగు వికెట్లు తీయ‌గా హేజిల్‌వుడ్‌, బొలాండ్‌లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు. ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌ను 393/8 వ‌ద్ద డిక్లేర్ చేయ‌గా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 386 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

James Anderson : జేమ్స్ అండ‌ర్స‌న్ అరుదైన ఘ‌న‌త‌.. 1100 వికెట్ల క్ల‌బ్‌లో చేరిక‌

ఓవ‌ర్ నైట్ స్కోరు రెండు వికెట్ల న‌ష్టానికి 28 ప‌రుగుల‌తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ మ‌రో 245 ప‌రుగులు జోడించి మిగిలిన ఎనిమిది వికెట్లు కోల్పోయింది. జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ ల‌కు మంచి ఆరంభాలు ల‌భించినా భారీ స్కోర్లుగా మ‌ల‌చ‌లేక‌పోయారు. ఒక్క‌రు కూడా అర్ధ‌శ‌త‌కాన్ని నమోదు చేయ‌లేక‌పోవ‌డంతో ఇంగ్లాండ్ 273 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో ల‌భించిన 7 ప‌రుగుల ఆధిక్యాన్ని క‌లుపుకుని ఆస్ట్రేలియా ముందు 281 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. నాలుగు సెషన్ల ఆట మిగిలిన ఉన్న నేప‌థ్యంలో ఈ మ్యాచ్‌లో ఫ‌లితం తేల‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. అయితే.. ఇంగ్లాండ్ బౌల‌ర్లు విజృంభిస్తే ఆసీస్ కు క‌ష్టాలు త‌ప్ప‌క‌పోవ‌చ్చు.

Suraj Randiv : 2011 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో ధోనికి ప్ర‌త్య‌ర్థిగా.. ఐపీఎల్‌లో మ‌హితో క‌లిసి ఆడిన ఓ మాజీ క్రికెట‌ర్ ధీన గాధ‌..