Suraj Randiv : 2011 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో ధోనికి ప్ర‌త్య‌ర్థిగా.. ఐపీఎల్‌లో మ‌హితో క‌లిసి ఆడిన ఓ మాజీ క్రికెట‌ర్ ధీన గాధ‌..

సాధార‌ణంగా క్రికెట‌ర్లు అంటే విలాస‌వంత‌మైన జీవితం గ‌డుపుతుంటారు. రిటైర్మెంట్ అయ్యాక కూడా కామెంటేట‌ర్లుగా, కోచింగ్ స్టాప్‌గా ప‌ని చేస్తూ మంచిగానే సంపాదిస్తుంటారు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అయితే అందరి జీవితం అలా ఉండ‌దు

Suraj Randiv : 2011 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో ధోనికి ప్ర‌త్య‌ర్థిగా.. ఐపీఎల్‌లో మ‌హితో క‌లిసి ఆడిన ఓ మాజీ క్రికెట‌ర్ ధీన గాధ‌..

Suraj Randiv-MS Dhoni

Suraj Randiv-MS Dhoni : సాధార‌ణంగా క్రికెట‌ర్లు అంటే విలాస‌వంత‌మైన జీవితం గ‌డుపుతుంటారు. రిటైర్మెంట్ అయ్యాక కూడా కామెంటేట‌ర్లుగా, కోచింగ్ స్టాప్‌గా ప‌ని చేస్తూ మంచిగానే సంపాదిస్తుంటారు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అయితే అందరి జీవితం అలా ఉండ‌దు. 2011 వ‌న్డే ప్ర‌పంచ ఫైన‌ల్‌లో ధోని(MS Dhoni)కి ప్ర‌త్య‌ర్థికి ఆడి, ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రుపున మ‌హేంద్రుడితో క‌లిసిన‌ ఆడిన ఓ మాజీ క్రికెట‌ర్ ప్ర‌స్తుతం బ‌స్సు డ్రైవ‌ర్‌గా త‌న జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు.

Ravindra Jadeja : జ‌డేజాను మాయ చేసింది.. ప‌బ్లిక్‌గానే క్ర‌ష్ నుంచి ప్ర‌మోష‌న్ ఇచ్చి మ‌రీ..

అత‌డు మ‌రెవ‌రో కాదు శ్రీలంక మాజీ ఆట‌గాడు సూరజ్ రందీవ్ (Suraj Randiv). కుడి వాటం గ‌ల స్పిన్న‌ర్ అయిన సూర‌జ్ 2009లో శ్రీలంక త‌రుపున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 12 టెస్టులు, 31 వ‌న్డేలు, 7 టీ20 మ్యాచ్‌ల్లో లంక కు ప్రాతినిధ్యం వ‌హించాడు. టెస్టుల్లో 43, వ‌న్డేల్లో 36, టీ20ల్లో 7 వికెట్లు తీశాడు. 2011 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన శ్రీలంక జ‌ట్టులో స‌భ్యుడు కూడా. ఆ మ్యాచ్‌లో 9 ఓవ‌ర్లు బౌలింగ్ చేసి 43 ప‌రుగులు ఇచ్చాడు. అయితే.. ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోయాడు. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన భార‌త్ 28 ఏళ్ల త‌రువాత వ‌న్డే ప్ర‌పంచ క‌ప్‌ను ముద్దాడింది.

James Anderson : జేమ్స్ అండ‌ర్స‌న్ అరుదైన ఘ‌న‌త‌.. 1100 వికెట్ల క్ల‌బ్‌లో చేరిక‌

2011లోనే చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రుపున ఐపీఎల్‌లో సూరజ్ రందీవ్ అరంగ్రేటం చేశాడు. సీఎస్‌కే త‌రుపున 8 మ్యాచులు ఆడాడు. ఆరు వికెట్లు తీశాడు. 2016లో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు మ‌కాం మార్చాడు. జీవితాన్ని వెల్ల‌దీసేందుకు ట్రాన్స్‌డేవ్ అనే కంపెనీలో బ‌స్ డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. అత‌డితో పాటు మ‌రో ఇద్ద‌రు మాజీ క్రికెట‌ర్లు శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్‌ చింతక జయసింఘే, జింబాబ్వే మాజీ ప్లేయర్ వాడింగ్టన్ మ్వేంగా లు సైతం ఇదే కంపెనీలో ప‌ని చేస్తున్నారు.

కాగా.. ఇటీవ‌ల బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీకి స‌న్న‌ద్దం అయ్యే క్ర‌మంలో ఆసీస్ జ‌ట్టు సూర‌జ్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకుంది.