Home » England Tour of India 2021
మూడు వన్డేల సిరీస్ టీమిండియాను వరించింది. ఇంగ్లండ్ తో జరిగిన ఆఖరి వన్డేలో కోహ్లీసేన 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 330 విజయ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ పోరాడి ఓడింది.
మూడు వన్డేలో సిరీస్లో ఆఖరి వన్డే పుణే వేదికగా జరుగుతోంది. చివరి వన్డేలో టీమిండియా 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రత్యర్థి జట్టు ఇంగ్లండ్ కు 330 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
మూడు వన్డేల సిరీస్ మ్యాచ్ లో భాగంగా ఆఖరి వన్డేలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 121 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ (7) ఔటయ్యాడు. తొలుత ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని కోహ్లీసేనను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.