Ind vs Eng 3rd ODI : ఆఖరి వన్డేలో మూడో వికెట్ కోల్పోయిన భారత్
మూడు వన్డేల సిరీస్ మ్యాచ్ లో భాగంగా ఆఖరి వన్డేలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 121 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ (7) ఔటయ్యాడు. తొలుత ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని కోహ్లీసేనను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

Ind Vs Eng 3rd Odi
India vs England 3rd ODI : మూడు వన్డేల సిరీస్ మ్యాచ్ లో భాగంగా పుణె వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 121 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ (7) ఔటయ్యాడు. తొలుత ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని కోహ్లీసేనను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.
ఓపెనర్ రోహిత్ శర్మ (38)లకు పెవిలియన్ చేరగా.. శిఖర్ ధావన్ (56 బంతుల్లో 10 ఫోర్లు) 67 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 16.4 ఓవర్ల వద్ద రెండో వికెట్ రూపంలో ధావన్ వెనుదిరిగాడు.
ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా (7) పరుగులకే చేతులేత్తేశాడు. 17.4 ఓవర్లు ముగిసే సరికి భారత్ 121 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయింది. 22.2 ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 150 పరుగులతో కొనసాగుతోంది.
ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్ (26), కెఎల్ రాహుల్ (5) నాటౌట్‌గా ఉన్నారు. మొదటి రెండు వన్డేల్లో టీమిండియా, ఇంగ్లండ్ తలో మ్యాచ్ గెలిచాయి. ఆఖరి వన్డేలో గెలిచిన జట్టుకే సిరీస్ దక్కనుంది.