Home » Green Manure Crops
నేల భౌతిక స్థితి పెరుగుబడి భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. నేల సేంద్రియ పదార్ధం వేయడం వల్ల సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. జీవ రసాయనిక చర్యలవల్ల నేల సారం పెరుగుతుంది. అంతేగాక నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది.
పశుల ఎరువు లభ్యత తక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చిరొట్ట పైర్లు రైతులకు సులభమైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. వ్యవసాయంలో రైతులు పూర్తిగా రసాయనిక ఎరువుల పైనే ఆధారపడుతున్నారు. దీంతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
పచ్చిరొట్ట ఎరువుల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. పప్పుజాతి పంటలైన ఈ మొక్కల వేర్లలో రైజోబియం బుడిపెలు వుంటాయి. ఇవి గాలిలోని నత్రజనిని గ్రహించి ఈ బుడిపెలలో నిక్షిప్తం చేస్తాయి. వీటిని భూమిలో కలియదున్నినప్పుడు, భూమి గుల్లగా మారి, నేలలోకి నీరు ఇంకే �