Soil Fertility : పచ్చిరొట్ట పైర్ల సాగుతో పెరగనున్న భూసారం.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు
నేల భౌతిక స్థితి పెరుగుబడి భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. నేల సేంద్రియ పదార్ధం వేయడం వల్ల సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. జీవ రసాయనిక చర్యలవల్ల నేల సారం పెరుగుతుంది. అంతేగాక నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది.

Green Manure Crops
Soil Fertility : మితిమీరిన రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూమి పంటల సాగు కు పనికి రాకుండా పోతోంది.త పంట పెట్టినా దిగుబడులు రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీలుగ, జనుము పిల్లిపెసర లాంటి పంటలను సాగుచేసి, పచ్చిరొట్టగా మార్చుకుని పొలాన్ని సారవంతం చేసుకోవాలని సూచిస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు.
గత కొన్నేళ్లుగా రైతులు రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల నేలలో సారం తగ్గి దిగుబడులు గణనీయంగా తగ్గడమే గాకుండా పెట్టుబడి కూడా పెరుగుతోంది. ఈసమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులను రుతు పవనాల ఆరంభంలో వేసుకోవాలి. దీని ద్వారా భూసారాన్ని పెంచుకుని పంట దిగుబడిని పెంచుకోవచ్చు. భూమిలో తేమ, పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చు. కాబట్టి పచ్చిరొట్ట ఎరువుల ప్రాధాన్యతను రైతులు తెలుసుకోవాలని మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. తిరుపతి .
READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!
నేల భౌతిక స్థితి పెరుగుబడి భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. నేల సేంద్రియ పదార్ధం వేయడం వల్ల సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. జీవ రసాయనిక చర్యలవల్ల నేల సారం పెరుగుతుంది. అంతేగాక నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. ఉత్పాదకత సామర్ధ్యాన్ని పెంచుకుంటుంది. నేలలో క్లిష్ట రూపంలో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయి. భూమిలో రసాయన ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులు ఉపయోగపడతాయి. కలుపు మొక్కలు పెరగకుండా నివారించవచ్చు.