Home » Soil Fertility
వ్యవసాయంలో రైతులు పూర్తిగా రసాయనిక ఎరువుల పైనే ఆధారపడటం వల్ల సాగులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. సేంద్రీయ ఎరువులు వాడక పోవటం వల్ల భూ సారం తగ్గి , దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. పెట్టుబడి భారం పెరుగుతోంది.
నేల భౌతిక స్థితి పెరుగుబడి భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. నేల సేంద్రియ పదార్ధం వేయడం వల్ల సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. జీవ రసాయనిక చర్యలవల్ల నేల సారం పెరుగుతుంది. అంతేగాక నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది.