Green Manure Cultivation : పచ్చిరొట్ట పైర్ల సాగుతో పెరగనున్న భూసారం.. దిగుబడులు పెరిగే అవకాశం

వ్యవసాయంలో రైతులు పూర్తిగా  రసాయనిక ఎరువుల పైనే ఆధారపడటం వల్ల సాగులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. సేంద్రీయ ఎరువులు వాడక పోవటం వల్ల భూ సారం తగ్గి , దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. పెట్టుబడి భారం పెరుగుతోంది.

Green Manure Cultivation : పచ్చిరొట్ట పైర్ల సాగుతో పెరగనున్న భూసారం.. దిగుబడులు పెరిగే అవకాశం

Green Manure Cultivation

Updated On : July 7, 2023 / 10:40 AM IST

Green Manure Cultivation : అధిక దిగుబడులకోసం మితిమీరిన రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల.. భూమిలో సేంద్రీయ కర్బనం తగ్గిపోయి చౌడుశాతం పెరిగిపోతోంది. పంటల సాగుకు పనికి రాకుండా పోతోంది. ఎంత  పెట్టుబడి పెట్టినా, దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు.

READ ALSO : Mango Cultivation : మామిడితోటల్లో చేపట్టాల్సిన తొలకరి యాజమాన్యం

ఇలాంటి పరిస్థితుల్లో జీలుగ, జనుము పిల్లిపెసర పచ్చిరొట్ట పంటలను పెంచి నేలలో కలియదున్నడం ద్వారా భూసారం పెంచుకోవచ్చు. పశువుల ఎరువు లభ్యత తక్కువగా వున్న ప్రస్థుత పరిస్థితుల్లో, పచ్చిరొట్ట పైర్ల సాగు రైతుకు సులభమైన మార్గమంటున్నారు శాస్త్రవేత్తలు.

READ ALSO : Guava Plantation : పెరిగిన జామతోటల విస్తీర్ణం.. తగ్గిన లాభాలు

వ్యవసాయంలో రైతులు పూర్తిగా  రసాయనిక ఎరువుల పైనే ఆధారపడటం వల్ల సాగులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. సేంద్రీయ ఎరువులు వాడక పోవటం వల్ల భూ సారం తగ్గి , దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. పెట్టుబడి భారం పెరుగుతోంది.

READ ALSO : Citrus Cultivation : నిమ్మతోటల్లో గజ్జితెగులు నివారణ చర్యలు

ఈసమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులను రుతుపవనాల ఆరంభంలో వేసుకోవాలి. అవకాశాన్నిబట్టి ఈ పైర్లను వేసుకుంటే  భూసారాన్ని పెంచుకునే వీలుంది. అంతే కాకుండా, వర్షాకాలంలో భూమి కోతకు గురి కాకుండా అరికట్టవచ్చు. భూమిలో తేమ, పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్.