Home » Heavy rains in Andhra Pradesh
కోస్తా తీరం వెంబడి గంటకు 45-65కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ఏపీకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రెండు రోజులు(సోమ, మంగళవారం) భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇది రానున్న 48 గంటల్లో పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల వెంబడి బలపడనుందని వివరించ�