AP Rains : అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల ప్రజలకు అలెర్ట్

కోస్తా తీరం వెంబడి గంటకు 45-65కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

AP Rains : అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల ప్రజలకు అలెర్ట్

Heavy Rains In AP : పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతోంది. ఆదివారం తెల్లవారుజాము నాటికి ఇది వాయుగుండంగా బలపడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ముసురు వాతావరణం ఉంటుందని, పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇవాళ ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ కోస్తా తీరం వెంబడి గంటలకు 45 నుంచి 65 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

Rain

ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్టణం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, గుంటూరు, ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సెప్టెంబర్ 1వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Rain

ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో రోడ్లు జలమయంగా మారాయి. బెజవాడలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. గడిచిన 24 గంటలుగా వర్షం కురుస్తుండటంతో కొండ ప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. పలుప్రాంతాల్లో వర్షాల కారణంగా ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయాయి. డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి.