Home » Hockey World Cup
న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో షూటౌట్లో భారత జట్టు పరాజయం పాలైంది. క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో 4-5 తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. పురుషుల హాకీ వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న భారత జట్టు అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.
ఆరంభ మ్యాచ్‌లో శుక్రవారం స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఘన విజయం సాధించింది. 2–0 గోల్స్ తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. భారత జట్టు వైస్ కెప్టెన్ అమిత్ రోహి దాస్ తొలి గోల్ కొట్టి భారత గోల్స్ ఖాతా తెరిచాడు.
ఒడిశాలో జరగనున్న హాకీ ప్రపంచ కప్-2023లో విజేతగా నిలిస్తే భారత జట్టులోని ప్రతి ఆటగాడికీ రూ.కోటి చొప్పున నజరానా ఇస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. మరో వారం రోజుల్లో ఒడిశాలోని కళింగ స్టేడియంలో ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.