Hockey World Cup 2023: హాకీ ప్రపంచ కప్ విలేజ్‌ను ప్రారంభించిన ఒడిశా సీఎం.. గెలిస్తే రూ.కోటి చొప్పున ఇస్తానన్న పట్నాయక్

ఒడిశాలో జరగనున్న హాకీ ప్రపంచ కప్-2023లో విజేతగా నిలిస్తే భారత జట్టులోని ప్రతి ఆటగాడికీ రూ.కోటి చొప్పున నజరానా ఇస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. మరో వారం రోజుల్లో ఒడిశాలోని కళింగ స్టేడియంలో ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.

Hockey World Cup 2023: హాకీ ప్రపంచ కప్ విలేజ్‌ను ప్రారంభించిన ఒడిశా సీఎం.. గెలిస్తే రూ.కోటి చొప్పున ఇస్తానన్న పట్నాయక్

Hockey World Cup 2023

Hockey World Cup 2023: ఒడిశాలో జరగనున్న హాకీ ప్రపంచ కప్-2023లో విజేతగా నిలిస్తే భారత జట్టులోని ప్రతి ఆటగాడికీ రూ.కోటి చొప్పున నజరానా ఇస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. మరో వారం రోజుల్లో ఒడిశాలోని కళింగ స్టేడియంలో ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియాతో నవీన్ పట్నాయక్ ఇవాళ మాట్లాడారు.

ఈ ప్రపంచ కప్ ను గెలిచి, ఛాంపియన్లుగా నిలవాలని అన్నారు. అలాగే, ఇవాళ రూర్కెలాలోని బిర్సా ముందా హాకీ స్టేడియం కాంప్లెక్స్ వద్ద ప్రపంచ కప్ విలేజ్ ను ఆయన ప్రారంభించారు. ఈ వరల్డ్ కప్ విలేజ్‌ను రికార్డు స్థాయిలో అతి స్వల్ప కాల వ్యవధిలో నిర్మించారు. అన్ని అత్యాధునిక సౌకర్యాలతో 9 నెలల్లో 225 గదులు నిర్మించారు.

హాకీ ప్రపంచ కప్ కు కావాల్సిన రీతిలో దీన్ని తీర్చిదిద్దారు. ప్రపంచ కప్ ఆడేందుకు వచ్చే దేశాల జట్లు, అధికారులు వరల్డ్ కప్ విలేజ్‌లో ఉంటారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒడిశాకు చెందిన పలువురు మంత్రులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. కాగా, హాకీ ప్రపంచ కప్ ను ఇంటర్నేషనల్​ హాకీ ఫెడరేషన్‌‌‌‌ నాలుగేళ్లకు ఒసారి నిర్వహిస్తుంది.

Ukraine-Russia war: ప్రతీకారం తీర్చుకోవడానికి.. అత్యాధునిక జిర్కాన్ హైపర్ సోనిక్ క్షిపణులను తరలించిన రష్యా