Home » IndVsSA 1st ODI
లక్నో వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ పోరాడి ఓడింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 9 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ వీరోచిత పోరాటం వృథా అయ్యింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు చేసింది. మిడిలార్డర్ లో హెన్రిచ్ క్లాసెన్ (74 నాటౌట్), డేవిడ్ మిల్లర్ (75 నాటౌట్) దూకుడుగా ఆడారు. హాఫ్ సెంచరీలతో మెరిశారు.