Home » Insect Pests
Pests of Cotton : ఈ ఏడాది సకాలంలో రుతుపవనాలు పలకరించాయి. కానీ సరిపడా వర్షాలు కురవలేదు. ముందుగా వేసిన పత్తి గింజలు కొన్ని చోట్ల ఎండిపోగా.. మళ్లి వేస్తున్నారు.
విత్తనాన్ని బాగా ఆరబెట్టాలి అనగా తేమ శాతం వరి గోధుమ, జొన్న మొక్కజొన్నలో 12 శాతం మరియు అపరాలలో 9 శాతంకి మించరాదు. విత్తన నిల్వ ఉండే గదుల్లో పగుళ్ళు, కన్నాలు పూడ్చి సున్నం వేస్తే దాగి ఉన్న పురుగులు నశిస్తాయి.
సుడిదోమలు వరి దుబ్బుల మొదళ్ళను అశించి నష్టపరుస్తాయి దీంతో మొక్కలు గిడసబారి పోషకాలు అందక పసుపు రంగుకు మారి సుడులు సుడులుగ ఎండిపోతుంది. వీటి ఉదృతి అధికంగా ఉన్నప్పుడు వరి కంకి వరకు కూడా అశించి నష్టాన్ని కలుగజేస్తాయి.
గింజలు మొలకెత్తినప్పుడు మొదటి 15 రోజులలో మొక్కలు పడిపోయి చనిపోతాయి. ఈ సమస్య నల్లరేగడి నెలల్లో ఎక్కువగా ఉంటుంది. దీని నివారణ కొరకు ఆఖరి దుక్కిలో ఎకరానికి 100 కిలోల వేప పిండి వేసి కలియ దున్నాలి.