Prevent Stored Grain : విత్తన నిల్వ సమయంలో ఆశించే పురుగులు, నివారణ

విత్తనాన్ని బాగా ఆరబెట్టాలి అనగా తేమ శాతం వరి గోధుమ, జొన్న మొక్కజొన్నలో 12 శాతం మరియు అపరాలలో 9 శాతంకి మించరాదు. విత్తన నిల్వ ఉండే గదుల్లో పగుళ్ళు, కన్నాలు పూడ్చి సున్నం వేస్తే దాగి ఉన్న పురుగులు నశిస్తాయి.

Prevent Stored Grain : విత్తన నిల్వ సమయంలో ఆశించే పురుగులు, నివారణ

Prevent Stored Grain

Prevent Stored Grain : రైతులు ఎంతో కష్టపడి పండించిన విత్తనాన్ని నిల్వ చేసుకోవడంలో నరైన జాగ్రత్తలను పాటించాలి. వివిధ పరిశోధనా ఫలితాల ప్రకారం నిల్వ చేసుకున్న విత్తనాలలో 15 నుంచి 25 శాతం వరకు కీటకాలు మరియు బూజు తెగుళ్ళ వలన నష్టం జరుగుతుందని అంచనా.

READ ALSO : Hyderabad : మహిళా ఐఏఎస్ అధికారికి వేధింపులు .. ఇంటికి వచ్చి హల్ చల్

విత్తనాలు నిల్వ నమయంలో చెడిపోవడానికి ముఖ్య కారణాలు:

1. విత్తనంలో తేమ శాతం అధికంగా ఉండటం

2 భద్రపరిచిన గదిలో తేమ మరియు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం

3. పూర్తిగా శుభ్రం చేయకుండా విత్తనాలను నిల్వ చేయడం

నిల్వ సమయంలో వివిధ రకాలైన కీటకాలు మరియు బూజు తెగుళ్ళు ఆశించడం వల్ల విత్తన నాణ్యత , మొలక శాతం తగ్గడం జరుగుతుంది.

నిల్వ సమయంలో అశించు ముఖ్యమైన పురుగులు

READ ALSO : US Airport : యూఎస్ విమానాశ్రయంలో సెక్యూరిటీ బాగోతం…ప్రయాణికుల బ్యాగులో నుంచి సెక్యూరిటీ వర్కర్ల డబ్బు చోరీ

1. వడ్ల చిలక : ఈ పురుగు వరి, గోధుమ, మొక్కజొన్న విత్తనాల్ని ఆశించే అతి ముఖ్యమైన వురుగు. ఈ పురుగు సీతాకోకచిలుక జాతికి చెందింది. రెక్కల పురుగులు, లేత గోధుమ రంగులో ఉంటాయి. ఈ పురుగులు విత్తనం పైన గ్రుడ్లు పెడతాయి. గ్రుడ్ల నుంచి వెలువడిన లార్వాలు విత్తనం లోపలికి వెళ్ళి లోపలి పదార్థం తింటూ అక్కడే కోశస్థదశకు చేరుకుంటాయి. వారం రోజులలో రెక్కల పురుగులు గుండ్రని రంధ్రం ద్వారా బయటకు వస్తాయి. వీటి జీవిత చక్రం 30-32 రోజుల్లో పూర్తవుతుంది.

2. ముక్కు పురుగు : ఈ పురుగు వరి, గోధుమ మరియు మొక్కజొన్న విత్తనాల్ని అధికంగా ఆశించి నష్టపరుస్తుంది. తల్లి పురుగు గింజల మీద చిన్న రంధ్రం చేసి దానిలో గ్రుడ్లు పెడుతుంది. గ్రుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు

3.మసి పురుగు : ఇది విత్తనాన్ని అశించే చిన్న పెంకు పురుగు. దీని తల క్రిందికి వంగినట్లుగా ఉంటుంది. ఈ పురుగులు గింజ మీద ఆకారం లేని పెద్ద పెద్ద రంధ్రాలు చేస్తాయి.

4 పిండి పురుగు : ఈ పురుగు బియ్యం పిండి, రవ్వ మైదాని ఎక్కువగా ఆశించి నష్టం కలిగిన్తుంది. ఇవి విసర్జించిన పదార్థం వల్ల పిండి ముక్కిపోయిన వాసన వస్తుంది.

READ ALSO : Pests in Rice : వరిలో పెరిగిన పురుగులు, తెగుళ్ల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

5. అపరాలను అశించే పుచ్చు పురుగు : ఈ పురుగు, గింజలపైన గ్రుడ్డని పెడుతుంది. గ్రుడ్ల నుంచి వచ్చిన లార్వా గింజలోనికి ప్రవేశించి లోపలి పదార్థాలను తింటూ కోశస్థ దశకు చేరుతుంది. వారం రోజుల తరువాత తల్లి పురుగు గింజ పైన గుండ్రని రంధ్రం చేసుకొని బయటకు, వస్తుంది.

6. వేరుశనగను ఆశించే పుచ్చు పురుగు : ఇది కాయల మీద రంధ్రం చేసి గింజలను తింటూ అపార నష్టాన్ని కలుగజేస్తుంది.

శిలీంధ్రాలు ;

విత్తనాన్ని నిల్వ నమయంలో సరిగ్గా అరబెట్టకపోతే వివిధ శిలీంధ్రాలు ఆశిస్తాయి. మొక్కజొన్న మరియు వేరుశనగలో తేమ శాతం ఉధృతమై అన్పర్జిల్లస్‌ అను శిలీంధ్రం ఆశించి గింజలపై తెల్లటీ, పచ్చని ,నల్లటి బూజుగా ఏర్పడుతాయి. దీని వలన గింజలు, నాణ్యత్య రంగు మరియు రుచిని కోల్పోతాయి. గింజలు అట్టలు కట్టి చెడు వానన వస్తాయి. ఈ శిలీంద్రాలు మైకోటాక్సిన్స్‌ అనే విషపూరిత రసాయనాలను గింజల్లో విడుదల చేస్తాయి. వేరుశనగ మరియు మొక్కజొన్నలో వీటిని అఫ్లోటాక్సిన్స్‌ అంటారు. ఈ విత్తనాలు మానవులు, కోళ్ళు మరియు పశువులకు హానికరం.

నివారణ :

శిలీంధ్రాలు తక్కువ తేమ ఉంటే అభివృద్ధి చెందవు. కావున విత్తనాలను సరిగ్గా ఆరబెట్టాలి. కీటకాలు మరియు ఎలుకలు ఉంటే శిలీంధ్రాల ఉధృతి ఎక్కువ, ఎందుకంటే ఇవి ఆశించడం వలన విత్తనాలు నాణ్యతను కోల్పోతాయి. గింజల్లో శిలీంద్రాలు సులభంగా ప్రవేశిస్తాయి. కావున కీటకాలు,ఎలుకలు విత్తన నిల్వలో లేకుందా జాగ్రత్త పడాలి. నిల్వలో శిలీంధ్రాలను అదుపులో ఉంచడానికి థైరామ్‌ (లేదా) కాష్ట్రాన్‌-2.5 గ్రా/ ఒక కిలో విత్తనానికి కలుపుకోవాలి.

READ ALSO : Summer Cultivable Vegetables : వేసవిలో సాగుచేయాల్సిన కూరగాయ పంటలు.. అధిక దిగబడికోసం శాస్త్రవేత్తల సూచనలు

విత్తన నిల్వ సమయంలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ;

విత్తనాన్ని బాగా ఆరబెట్టాలి అనగా తేమ శాతం వరి గోధుమ, జొన్న మొక్కజొన్నలో 12 శాతం మరియు అపరాలలో 9 శాతంకి మించరాదు. విత్తన నిల్వ ఉండే గదుల్లో పగుళ్ళు, కన్నాలు పూడ్చి సున్నం వేస్తే దాగి ఉన్న పురుగులు నశిస్తాయి.

నిల్వచేసే గదిలో గాలి, వెలుతురు ఉండేలా చూడాలి. ఆ వర్షాకాలంలో విత్తనానికి తేమ తగలకుండా తగు, జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు కొత్త సంచుల్లో విత్తనాన్ని నిల్వ చేయాలి లేని పక్షంలో పాత సంచులను మలాథియాన్‌ మందు ద్రావణంలో ముంచి ఆరబెట్టిన తరువాత
విత్తనాన్ని నింపుకోవాలి.

సంచులను నేరుగా నేలపైన కాకుండా కొంచెం ఎత్తైన చెక్కబల్లపై నిల్వ చేయాలి. అ పాలిథీన్‌ లైనింగ్‌ ఉన్న సంచులను వాడితే పురుగులు తక్కువగా ఆశించడం జరుగుతుంది.

READ ALSO : Vijay Devarakonda : వందమందికి చెక్కులిచ్చి ఎమోషనల్ అయిన విజయ్ దేవరకొండ.. ఒకప్పుడు తమ్ముడి ఫీజు కట్టడానికి ఇబ్బంది పడ్డాం..

విత్తనశుద్ధి :

నిల్వ సమయంలో ఆశించిన వురుగులు మరియు తెగుళ్ళను బట్టి సరైన సస్యరక్షణ మందులతో విత్తనశుద్ధి చేసుకోవాలి. విత్తనశుద్ధి చేసిన గింజలను ఆహార పదార్ధంగా. వాడరాదు.