Hyderabad : మహిళా ఐఏఎస్ అధికారికి వేధింపులు .. ఇంటికి వచ్చి హల్ చల్

ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ ఘటన మాదిరిగానే మరో ఐఏఎస్ అధికారిణి వేధింపులకు గురైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ మార్కెట్ పరిధిలోని ఆఫీసులో డైరెక్టర్ పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిణి ఇంటికి రాత్రి సమయంలో వచ్చి హల్ చల్ చేశాడు.

Hyderabad : మహిళా ఐఏఎస్ అధికారికి వేధింపులు .. ఇంటికి వచ్చి హల్ చల్

woman IAS officer complaint against man

Updated On : September 16, 2023 / 10:27 AM IST

Hyderabad Woman IPS : ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ ఘటన మాదిరిగానే మరో ఐఏఎస్ అధికారిణి వేధింపులకు గురైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ మార్కెట్ పరిధిలోని ఆఫీసులో డైరెక్టర్ పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిణి ఇంటికి రాత్రి సమయంలో వచ్చి హల్ చల్ చేశాడు. నేను మీ ఫ్యాన్ మాడమ్ అంటే ఇంటి వరకు వచ్చేశాడు. ఆమె పనిచేసే ఆఫీసుకు పదే పదే వచ్చి ఇబ్బంది పెడుతుండేవాడు శివప్రసాద్ అనే వ్యక్తి. ప్రతీ రోజు ఏదో పని ఉందని రావటం..ఏదోకటి మాట్లాడటం చేసేవాడు. పొంతన లేకుండా మాట్లాడటం పని ఏమీ లేకపోయినా ఏదోక సాకుతో ఆఫీసుకు రావటం వచ్చాక ఏదోదో మాట్లాడటంతో ఆమె విసిగిపోయారు. దీంతో ఆమె అతను ఈసారి ఆఫీసుకు వస్తే లోపలికి రానియ్యవద్దని సిబ్బంది సూచించారు ఆమె.

Irom Sharmila : చంద్రబాబు అరెస్ట్‌పై ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

దీంతో ప్రతీరోజు వచ్చినట్లుగా వచ్చిన శివప్రసాద్ ను ఆఫీస్ సిబ్బంది లోపలికి రానివ్వలేదు. దీంతో అతను అక్కడనుంచి వెళ్లిపోయాడు.కానీ అనూహ్యంగా నేరుగా ఐఏఎస్ అధికారిణి ఇంటికి వెళ్లాడు శివ ప్రసాద్  ఇంటికి వెళ్లి మేడమ్ ని కలవాలంటే హంగామా చేశాడు.ఐఏఎస్ అధికారిణి కి తాను సోషల్ మీడియాలో పెద్ద ఫ్యాన్ అంటూ హంగామా..
నేను ఆమెను కలిసేందుకు వచ్చాను లోపలికి వెళ్లనివ్వండి అంటూ సెక్యురిటీతో వాగ్వాదానికి దిగాడు.దీంతో ఆమె శివ ప్రసాద్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ అధికారిణి సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో మొండా మార్కెట్లో శివప్రసాద్ పై కేసు నమోదు చేశారు.