Irom Sharmila : చంద్రబాబు అరెస్ట్‌పై ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మి చంద్రబాబును అరెస్టును ఖండించారు. అక్రమ కేసులో ఇరికించి రిమాండ్ కు తరలించటంపై మండిపడ్డారు. దార్శనికుడైన నేతలు జైలులో పెట్టటం యావత్ దేశమంతా ఖండించాలని పిలుపునిచ్చారు.

Irom Sharmila : చంద్రబాబు అరెస్ట్‌పై ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

Irom Sharmila..Chandrababu arrest

Irom Sharmila..Chandrababu arrest : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు(Chandrababu)పై జాతీయ స్థాయి నేతలు ఎంతోమంది ఖండిస్తున్నారు.పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్,కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి ఇలా ఎంతోమంది ప్రముఖులు ఖండిస్తున్నారు. ఈక్రమంలో మణిపూర్ (Manipu)ఉక్కు మహిళగా పేరొందిన ఇరోమ్ షర్మిల (Irom Chanu Sharmila )కూడా స్పందించారు. చంద్రబాబును అరెస్టును ఖండించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని ప్రసంశిస్తు అటువంటి నేతను ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నేతలను అక్రమ కేసులో ఇరికించి రిమాండ్ కు తరలించటంపై మండిపడ్డారు. దార్శనికుడైన నేతలు జైలులో పెట్టటం యావత్ దేశమంతా ఖండించాలని పిలుపునిచ్చారు.

అవినీతి జరిగిందనే ఆరోపణలో అరెస్ట్ చేశారు. అవినీతి జరిగితే విచారణ చేసి అరెస్ట్ చేయాలి గానీ ఇలా అక్రమంగా అరెస్ట్ చేయటం దారుణమన్నారు. 16 ఏళ్ల పాటు జైలుశిక్షను, గృహనిర్బంధాన్ని ఎదుర్కొంటున్న తనకు రాజకీయ ఖైదీల పట్ల సానుభూతి ఉందన్నారు. చంద్రబాబు ఒక దార్శనికత కలిగిన ప్రజానాయకుడిగా ఎంతో ఖ్యాతి గడించారని అటువంటి నాయకుడిని అక్రమంగా నిర్బంధించడాన్ని తాను ఖండిస్తున్నానని, దీన్ని అందరూ ఖండించాల్సిందే అన్నారు.

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో మణిపూర్ లాంటి ఘటన.. సీఎం సొంత ప్రాంతంలోనే ఉన్మాదపు ఘటన

దేశంలో రాజకీయ నేతల అవినీతిని సమేతుకమైన విచారణ జరిగితే ఒక్క బీజేపీ నేతపై కూడా ఈడీ ఎందుకు అభియోగాలు మోసలేదు? అంటూ ఈ సందర్భంగా ఇరోమ్ షర్మిల ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేసిన నాయకుడు చంద్రబాబు. చంద్రబాబు అభివృద్ధి కోసం చేసిన సేవలను ఆమె కొనియాడారు. రాజకీయ ప్రత్యర్ధులను నిర్వీర్యం చేైసేందుకే మోదీ ఇదంతా చేయిస్తున్నారనేది స్పష్టం అని ఆమె అన్నారు. ప్రజా నాయకులను అవినీతి పరులుగా ముద్ర వేసి హింసించకూడదన్నారు. ఒకరు ఇద్దరు కాదు ఎందరో ఏళ్ల తరబడి రాజకీయ ఖైదీలుగా జైళ్లలో మగ్గిపోతున్నారు అంటూ ఇరోమ్ షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.

ఒకవేళ దేశవ్యాప్తంగా రాజకీయ నేతల అవినీతికి వ్యతిరేకంగా సహేతుకమైన దర్యాఫ్తు జరిగితే ఈడీ ఇంత వరకు ఒక్క బీజేపీ నాయకుడిపై కూడా నేరం ఎందుకు మోపలేదో చెప్పాలన్నారు. ఇదంతా తన రాజకీయ ప్రత్యర్థులను నిర్వీర్యం చేసేందుకు ప్రధాని మోదీనే చేస్తున్నారని స్పష్టమవుతోందన్నారు. ప్రజాస్వామ్యం, మానవహక్కులను గౌరవించి ప్రధాని మోదీ వారందర్నీ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోను టీడీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. వేలాది మంది ఈ వీడియోను వీక్షించారు. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.