Home » Irrigation Management -
ఈ ఏడాది చాలా మంది రైతులు పత్తిసాగు చేపట్టారు. ప్రస్తుతం పత్తి 25 - 45 రోజుల దశలో ఉంది . అయితే వరుసగా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచి పోయింది. ఇటు గాలిలో తేమశాతం అధికంగా ఉండటంతో చీడపీడలు సోకే ప్రమాదం ఏర్పడింది.
సాధారణంగా మొక్కజొన్నలో నీటిని సాళ్ళపద్ధతిలో ఇస్తారు. దీని వల్ల చాలా నీరు వృధా అవుతుంది. దీన్ని అధిగమించటానికి నీటిని ప్రత్యామ్నాయ సాళ్ళ పద్ధతిలో ఇవ్వటం మంచిది. ఈ పద్ధతి వల్ల 50 శాతం నీటిని అదా చేసుకోవచ్చు.
వేసవిలో సగటున కాపుకాసే చెట్టుకు రోజుకు సుమారు 50-60 లీటర్ల వరకు సేద్యపు నీరు అవసరమవుతోంది. భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు సిఫార్సు చేసిన మేరకు నీరు కొబ్బరి తోటలకు అందించలేకపోతున్నారు. ఫలితంగా కొబ్బరి తోటలు నీటి ఎద్దడికి గురి అవుతున్నాయి.