Water Management Methods : కొబ్బరి సాగులో నీటియాజమాన్య పద్దతులు!

వేసవిలో సగటున కాపుకాసే చెట్టుకు రోజుకు సుమారు 50-60 లీటర్ల వరకు సేద్యపు నీరు అవసరమవుతోంది. భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు సిఫార్సు చేసిన మేరకు నీరు కొబ్బరి తోటలకు అందించలేకపోతున్నారు. ఫలితంగా కొబ్బరి తోటలు నీటి ఎద్దడికి గురి అవుతున్నాయి.

Water Management Methods : కొబ్బరి సాగులో నీటియాజమాన్య పద్దతులు!

coconut cultivation!

Updated On : January 24, 2023 / 11:32 AM IST

Water Management Methods : నీటి సదుపాయం, వర్షపాతం అధికంగా ఉండే సారవంతమైన డెల్టా భూములు కొబ్బరి సాగుకు అనుకూలంగా ఉంటాయి. గాలిలో తేమ ఎక్కవగా ఉండే ప్రాంతాల్లో ఈ పంట అనువుగా ఉంటుంది. నీటి సదుపాయం కలిగిన గరప, ఎర్రనేలలు, కొబ్బరి పెంపకానికి బాగుంటాయి. మొక్కల పెరుగుదల కూడా బాగుంటుంది. కొబ్బరి నారు పెంపకం నుండి మొక్కలు నాటం, కాపుకు వచ్చేంత వరకు అనేక జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ప్రత్యేకం కొబ్బరి పంటకు నీరు అనేది చాలా ముఖ్యమైనది. పంటకు నీటిని అందించే విషయంలో సరైన యాజమాన్య పద్ధతులు అనుసరించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

నీటి యాజమాన్య పద్ధతులు ;

కొబ్బరి తోటల సాగులో నీరు ప్రధానమైనది. తేమ ఆరకుండా, భూమి, స్వభావాన్ని వాతావరణాన్ని బట్టి కొబ్బరి చెట్లకు నీరు సక్రమముగా అందించాలి. డెల్టా ప్రాంతాలలో నీటిని తోటలలో పారించే పద్ధతి అనుసరిస్తున్నారు. అయితే ఈ పద్ధతిలో సేద్యపు నీరు ఎక్కువగా వృధా అయి, తెగుళ్ళు కూడా తొందరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. చెట్లు చుట్టూ పాదుచేసి బేసిన్‌ పద్ధతి ద్వారా నీటిని అందించటం మంచిది.

డ్రిప్పు పద్ధతి ద్వారా నీటిని తోటలకు అందించడము ద్వారా నీటిని బాగా పొదుపు చేయవచ్చును. నల్ల రేగడి భూములలో 20 రోజులకు, తేలికపాటి ఎర్రభూములలో 10 రోజులకు ఒకసారి నీరు తప్పక అందించాలి. తేలిక భూములలో వేసవి మాసాల్లో 5-7 రోజులకొకసారి తడినీయక తప్పదు. నీటి ఎద్దడికి గురికాకుండా కొబ్బరి తోటలలో జాగ్రత్త పడాలి. నీటి ఎద్దడి వలన పిందెరాలుడు, కాయ యొక్క పరిమాణం తగ్గిపోవడం జరుగుతుంది.

నీటి ఎద్దడి లక్షణాలు, ప్రభావం:

వేసవిలో సగటున కాపుకాసే చెట్టుకు రోజుకు సుమారు 50-60 లీటర్ల వరకు సేద్యపు నీరు అవసరమవుతోంది. భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు సిఫార్సు చేసిన మేరకు నీరు కొబ్బరి తోటలకు అందించలేకపోతున్నారు. ఫలితంగా కొబ్బరి తోటలు నీటి ఎద్దడికి గురి అవుతున్నాయి. ఈ నీటి ఎద్దడి వలన తోటలలో ముదురు చెట్ల క్రింద వరుస ఆకులు వాడి వేలాడడం, పూత కొద్దిగా వచ్చుట, పిందె ఎక్కువగా రాలడం వంటి లక్షణాలు కనబడుతాయి.

ఈ నీటి ఎద్దడి వలన కొత్త ఆకులు ఏర్పడడం తగ్గుతుంది. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి వేడిగాలులు సోకే వేసవి మాసంలో పూల ఫలదీకరణ తగ్గి పిందె కట్టడం కూడా బాగా తగ్గుతుంది. అంతేకాక కొబ్బరి దిగుబడి, కాయ సైజు, కొబ్బరి నాణ్యత కూడ తగ్గుతాయి. అందువలన వేసవి “మాసాల్లో, చెట్టు పళ్లెంలో కొబ్బరి డొక్క లేదా కొబ్బరి ఆకు లేదా కొబ్బరి పొట్టును పరచి తేమను నిల్వ ఉంచేలా చేసుకోవాలి.