Home » kharif cultivation
Kharif Cultivation : కొంత మంది రైతులు దుక్కులను సిద్ధం చేస్తుండగా, ఇప్పటికే దుక్కి దున్నిన రైతులు కొందరు విత్తనాలను విత్తుతున్నారు.
సరైన రకాన్ని, సరైన సమయంలో సాగుచేస్తే ప్రతి కూల పరిస్థితులను అధిగమించి 50 శాతం దిగుబడి సాధించినట్లే . మిగతా 50 శాతం సాగులో మనం పాటించే యాజమాన్యం పై ఆధారపడి వుంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా వున్నా ఆశించిన ఫలితాలు రావు.
కొంతమంది రైతులు ధర తగ్గుతుందని రసీదులు లేకుండా కొనుగోలు చేస్తూ వుంటారు. ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదు. విత్తనం కొన్నప్పుడు రశీదు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ మొలకశాతం తక్కువగా వున్నా, విత్తనాలు నాశిరకానివైనా, పరిహారం పొందటానకి ఈ బిల్లుల�