kharif Rice varieties : ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు.. అందుబాటులో దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రకాలు

సరైన రకాన్ని, సరైన సమయంలో సాగుచేస్తే ప్రతి కూల పరిస్థితులను  అధిగమించి 50 శాతం దిగుబడి సాధించినట్లే . మిగతా 50 శాతం సాగులో మనం పాటించే యాజమాన్యం పై ఆధారపడి వుంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా వున్నా ఆశించిన ఫలితాలు రావు.

kharif Rice varieties : ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు.. అందుబాటులో దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రకాలు

Rice Varieties

Updated On : June 9, 2023 / 10:36 AM IST

ఖరీఫ్ వరిసాగుకు సమయం ఆసన్నమయ్యింది . రైతులు రకాలను ఎంచుకుని, విత్తనాలు సమకూర్చుకునే  పనిలో వున్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ప్రస్థుతం ప్రాచుర్యంలో వున్న పాత రకాలతోపాటు, అనే కొత్త వరి వంగడాలను శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు .

READ ALSO : Rice Varieties : ఖరీఫ్ కు అనువైన స్వల్పకాలిక.. సన్నగింజ వరి రకాలు

ప్రాంతాలకు అనుగుణంగా  వీటి గుణగణాలను పరిశీలించి, ఏటా సాగుచేసే సంప్రదాయ రకాల స్థానంలో  రైతులు వీటిని సాగుకు ఎంచుకోవచ్చు . తెలంగాణాకు అనువైన వరి వంగడాలు, వాటి విశిష్ఠ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ వరి దాదాపు అన్ని జిల్లాల్లోను కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగవుతోంది . ప్రస్థుతం వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి  తెచ్చారు.

READ ALSO : Planting Kanda : కంద నాటడానికి జూన్ నెల అనుకూలం.. అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన మెళకువలు

చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో వుండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి, అధిక దిగుబడినిచ్చే నూతన రకాలవైపు దృష్టి సారించాలి.

సరైన రకాన్ని, సరైన సమయంలో సాగుచేస్తే ప్రతి కూల పరిస్థితులను  అధిగమించి 50 శాతం దిగుబడి సాధించినట్లే . మిగతా 50 శాతం సాగులో మనం పాటించే యాజమాన్యం పై ఆధారపడి వుంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా వున్నా ఆశించిన ఫలితాలు రావు.

READ ALSO : Sorghum Cultivation : ఖరీఫ్ జొన్న సాగులో మేలైన యాజమాన్యం

కాబట్టి రకాల ఎంపిక, సాగుచేసే సమయం, పంటకాల పరిమితి అనేవి వరిసాగులో  కీలకమైన విషయాలుగా పరిగణించాలని సూచిస్తూ, తెలంగాణ ప్రాంతానికి అనువైన మేలైన వరి రకాల గురించి తెలియజేస్తున్నారు  రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. చంద్రమోహన్‌.