Home » local bodies quota
ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించనుంది. సోమవారం తొమ్మిది మంది అభ్యర్థుల ఎంపికను సీఎం జగన్ ఫైనల్ చేయనున్నారు. ఇప్పటికే ఇద్దరు పేర్లు ఖరారు అయ్యాయి. జయమంగళ వెంటకరమణ, కుడుపూడి సూర్యనారాయణ పేర్లు ఖరారు అయ్యాయి.
ఏపీలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలకాగా.. నేటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. దీంతో అధికార పార్టీ వైసీపీ ఫోకస్ పెట్టింది.
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. 8 జిల్లాల నుంచి 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థులను ప్రకటించారు.