MLC Elections : ఏపీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ

ఏపీలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే షెడ్యూల్‌ విడుదలకాగా.. నేటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. దీంతో అధికార పార్టీ వైసీపీ ఫోకస్‌ పెట్టింది.

MLC Elections : ఏపీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ

Ap Mlc Elections

Updated On : November 16, 2021 / 1:18 PM IST

Nominations for AP MLC Elections : ఏపీలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే షెడ్యూల్‌ విడుదలకాగా.. నేటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. దీంతో అధికార పార్టీ వైసీపీ ఫోకస్‌ పెట్టింది.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది.. ఈ ఎన్నికను డిసెంబర్‌ 10న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రెండేసి స్థానాలకు.. అనంతపురం, విజయనగరం, చిత్తూరు, ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక్కో స్థానానికి… డిసెంబర్‌ 10న ఎన్నికలు జరగనున్నాయి.

పెద్దల సభకు పంపించాల్సిన నేతల పేర్లపై వైసీపీ హైకమాండ్‌ కసరత్తు చేస్తోంది. జిల్లాల వారీగా పలువురి పేర్లను పరిశీలిస్తోంది. అనంతపురం జిల్లాలో ఒకే ఎమ్మెల్సీ స్థానం ఉండగా.. విశ్వేశ్వర్‌రెడ్డి, శివరామిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో రెండు స్థానాలకు నుంచి తలశిల రఘురాం, లంకా వెంకటేశ్వరావు.. ఆశావహుల జాబితాలో ఉన్నారు. తూర్పు గోదావరిలో అనంతబాబు ఒక్కరి పేరే వినిపిస్తోంది. ఇక గుంటూరు జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా… ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.

Air Pollution : ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం..ఫిజికల్ స్కూల్స్ మూసివేత, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

విజయనగరం నుంచి ఇందుకూరు రఘురాజు పేరును వైసీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక- విశాఖలో రెండు స్థానాలకు వరుదు కల్యాణి, వంశీకృష్ణ యాదవ్‌ పేర్లు వినిపిస్తున్నాయి. చిత్తూరు జల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుండగా.. భరత్‌ పేరు ఫైనల్‌ అయినట్లు సమాచారం. ఈ సారి ఇక ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌లేని వ్యక్తులకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు సీఎం జగన్‌..