Home » Love Agarwal
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నవేళ కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావద్దని సూచించింది.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 వేల 67కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీలోని మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో 1445 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించినట్లు తెలిపారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భూతం..భారతదేశాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి బారిన వందలాది మంది పడ్డారు. కరోనా పాజిటివ్ లక్షణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ ని కట్టడి చేసేందుకు కేంద్రం తగు చర్యలు తీసుకొంటోంది. అందులో భాగ�