Home » Lower blood pressure
ప్రతిరోజూ తినే ఆహారంలో తక్కువ మొత్తంలో సోడియం తీసుకోవడం వల్ల కలిగే 6 ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సోడియం (ఉప్పు) ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. సాల్టెడ్ స్నాక్స్ ఏవైనా అదనపు ఉప్పునుఇచ్చేవే. బీపీ కంట్రోల్ లో ఉండాలంటేఇలాంటి రెడీ టు ఈట్ ఫుడ్స్ కి దూరంగా ఉండటం మంచిది.
ఆకు కూరలలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది సోడియం ప్రభావాలను ఎదుర్కోవడం ద్వారా రక్తపోటును తగ్గిస్తుంది. టమోటాలు, బంగాళదుంపలు, బీట్రూట్, చిలగడదుంపలు, పుట్టగొడుగులు , వెల్లుల్లి వంటి కూరగాయలు రక్తపోటును తగ్గించటంలో దోహదపడతాయి.
కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఎలక్ట్రోలైట్లతో నిండిన ఈ సహజ పానీయం మూత్రపిండాలు శరీరం నుండి అధిక సోడియం స్థాయిలను బయటకు పంపటంలో సహాయపడుతుంది. రక్తపోటును తగ్గించడానికి ఇది అవసరమౌతుంది
కోడిగుడ్డు పచ్చసొన అధిక మొత్తంలో కొవ్వులు కలిగి ఉన్నప్పటికీ దాని ద్వారా రక్తంలో కొలెస్టరాల్ స్థాయిలు మాత్రం పెరుగవని హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కోడిగుడ్డు పచ్చసొనలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. దీనిలోని ల్యూటిన్ అనే యాంటీ ఆక