Consuming Less Sodium : మీ ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ప్రతిరోజూ తినే ఆహారంలో తక్కువ మొత్తంలో సోడియం తీసుకోవడం వల్ల కలిగే 6 ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Consuming Less Sodium : మీ ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Consuming Less Sodium ( Image Credit : Pexels )

Less Sodium Benefits : అధిక మొత్తంలో సోడియం తీసుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. సోడియం తగ్గించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఆహారంలో తక్కువ సోడియం వినియోగంతో ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ప్రతిరోజూ తినే ఆహారంలో తక్కువ మొత్తంలో సోడియం తీసుకోవడం వల్ల కలిగే 6 ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. లో బీపీ :
సోడియం అధికంగా తీసుకోవడం వల్ల హైబీపీ వస్తుంది. సోడియం తగ్గిస్తే రక్తపోటు స్థాయిలు కూడా తగ్గుతాయి. గుండెపోటు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Read Also : Garlic Health Benefits : వెల్లుల్లి తింటే కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే.. మీ డైట్‌లో తప్పక చేర్చుకోండి!

2. మెరుగైన గుండె ఆరోగ్యం :
అధిక రక్తపోటు గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. సోడియం తీసుకోవడం తగ్గించాలి. దాంతో గుండె పనితీరు మెరుగ్గా పనిచేస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

3. స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది :
హైబీపీ అనేది స్ట్రోక్‌కు ప్రధాన కారణం. సోడియం తీసుకోవడం తగ్గించాలి. తత్ఫలితంగా రక్తపోటును తగ్గించడం ద్వారా స్ట్రోక్ ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. మెరుగైన ఆరోగ్యంతో పాటు దీర్ఘాయువును పొందవచ్చు.

4. మూత్రపిండాల పనితీరు :
అధిక సోడియం వినియోగం మూత్రపిండాలపై భారం పడుతుంది. మూత్రపిండాలు దెబ్బతినడానికి, కాలక్రమేణా పనిచేయకపోవడానికి దారితీస్తుంది. సోడియం తీసుకోవడం తగ్గిస్తే ఈ భారాన్ని తగ్గించవచ్చు. కిడ్నీ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5. ఎముకల ఆరోగ్యం :
అధిక సోడియంతో కాల్షియం విసర్జనకు సంబంధం ఉంటుంది. కాలక్రమేణా ఎముకలను బలహీనపరుస్తుంది. బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులకు దారితీస్తుంది. సోడియం తగ్గించడం ద్వారా కాల్షియం స్టోరింగ్ మెరుగుపడుతుంది. ఎముక సాంద్రతను పెంచుతుంది. దాంతో ఎముక పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

6. కడుపు క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది :
అధిక ఉప్పు తీసుకోవడం వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సోడియం వినియోగాన్ని తగ్గించడం ద్వారా ముఖ్యంగా ఉప్పగా ఉండే ఆహారాలు, ప్రాసెస్ చేసిన మాంసాలను తీసుకోవడం తగ్గించాలి. తద్వారా కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు.

Read Also : World Health Day : మీకు ప్రీ-డయాబెటిస్‌ ఉందని తెలుసా? కంట్రోల్ చేయకుండా వదిలేయవద్దు.. వైద్యుల హెచ్చరిక..!