Home » Madanapalle sub collectors office fire Incident
దాదాపు 8 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు ఏపీ పోలీసులు.
సీఎం హోదాలో జగన్ ఏపీని పాలించగా, మంత్రిగా, రాయలసీమ ప్రాంతానికి చెందిన కీలకనేతగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఆ ప్రాంతంలోని నాలుగు ఉమ్మడి జిల్లాలను తన గుప్పెట్లో పెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
జిల్లాల విభజన తర్వాత పుంగనూరు భూముల దస్త్రాలు చిత్తూరు కలెక్టరేట్ లో కాకుండా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులోనే ఎందుకు ఉంచారు? అనే కోణంలోనూ దర్యాఫ్తు కొనసాగుతోంది.
ఆ నేత కుటుంబ సభ్యులు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ప్రభుత్వానికి వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఫైళ్లే కాలిపోతున్నాయని ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
సాక్ష్యాలు మాయం చేయడానికి ఇలా చేసే అవకాశం ఉంది. ఈ తరహా ఘటనలపై ఇక కఠిన చర్యలు ఉంటాయి.
ఈ ఘటనపైన జిల్లా కలెక్టర్ తో కూడా చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. ఈ ఘటన రాత్రి 11 గంటల 24 నిమిషాలకు జరిగినట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు.