Home » mango production
పూత వచ్చిన తరువాత పూత విచ్చుకోక ముందే ఒకసారి ప్లానోఫిక్స్ను 3 మిలీ. 15 లీ. నీటికి కలిపి పిచికారి చేస్తే పూత అనేది ఎక్కువ శాతం పిందె కట్టడానికి ఉవయోగపడుతుంది. అలాగే పిందె బఠాణి సైజు నుండి గోళీ సైజులో ఉన్నప్పుడు ఎక్కువగా పిందెరాలడం జరుగుతుంది.
జూలై నుండి ఆగస్టు నెలల్లో కొమ్మల కత్తిరింపులు, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యంతో పాటుగా అవసరానికి అనుగుణంగా సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది.