Mango Cultivation : మామి తోటల్లో పూత రావటానికి, వచ్చే సమయంలో చేపట్టాల్సిన చర్యలు !

పూత వచ్చిన తరువాత పూత విచ్చుకోక ముందే ఒకసారి ప్లానోఫిక్స్‌ను 3 మిలీ. 15 లీ. నీటికి కలిపి పిచికారి చేస్తే పూత అనేది ఎక్కువ శాతం పిందె కట్టడానికి ఉవయోగపడుతుంది. అలాగే పిందె బఠాణి సైజు నుండి గోళీ సైజులో ఉన్నప్పుడు ఎక్కువగా పిందెరాలడం జరుగుతుంది.

Mango Cultivation : మామి తోటల్లో పూత రావటానికి, వచ్చే సమయంలో చేపట్టాల్సిన చర్యలు !

Mango Production

Mango Cultivation : పండ్ల తోటల్లో మావిడి సాగు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. ఉత్తరప్రదేశ్ తరువాత మన తెలుగు రాష్ట్రాల్లో ఆధికంగా సాగు చేస్తున్నారు. మామిడి ఎగుమతుల్లో మన తెలుగు రాష్ట్రల్లో సాగు చేయబడే బంగీనపల్లి రకానికి ఆధిక ప్రాధాన్యత ఉంది. మామిడి సాగులో వాతవరణ పరిస్ధితులు కీలకపాత్ర పోషిస్తాయమి. రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించటం ద్వారా పూత, కాతకు తోడ్పడతాయి.

READ ALSO : Sesame Cultivation : వేసవి నువ్వు సాగులో చీడపీడల నివారణ

యాజమాన్య పద్దతుల్లో చెట్టును బెట్టకు గురిచేయడం ముఖ్యమైనవి. వాతావరణ పరిస్థితుల్లో చెట్టుకు కనీసం 15′ సెం. కంటే తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు అవసరం. సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో నవంబరు ,డిసెంబరులో రాత్రి ఉష్టోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అందువల్ల డిసెంబరులో రావలసిన పూత జనవరిలో వస్తుంది. కావున రైతులు జనవరి నుంచి యాజమాన్య వద్దతులు చేపట్టడం వల్ల మంచి దిగుబడులు పొందవచ్చు.

పూత వచ్చేందుకు:

డిసెంబరులో పూత రానట్లైతే జనవరి మొదటివారంలో 10 గ్రా. పొటాషియం నైట్రేట్‌ + 5 గ్రా. యూరియా లీటరు నీటిలో కలివి విచికారి చేయాలి. ఇలా చేయడం వల్ల త్వరగా పూ మొగ్గలు వస్తాయి. కాయ బఠాణి సైజులో ఉన్నప్పుడు 2 శాతం యూరియా పిచికారి చేయడం వల్ల కాయ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.

READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

పొటాషియం నైటేట్‌తో పాటు యూరియా కలపడం వల్ల అకులు మందును త్వరగా పీల్చుకుంటాయి. పొటాషియం నైట్రేట్‌ ఆకులపై నేరుగా పిచికారి చేయడం వల్ల అకులు వాటిని త్వరగా ఆహార పదార్థాలుగా మార్చుకొని పూమొగ్గలకు తొందరగా చేరవేసి పూత రావడానికి తోడ్పడుతుంది.

పూత మొదలైన తరువాత యాజమాన్య పద్ధతులు :

పూత వచ్చిన తరువాత పూత విచ్చుకోక ముందే ఒకసారి ప్లానోఫిక్స్‌ను 3 మిలీ. 15 లీ. నీటికి కలిపి పిచికారి చేస్తే పూత అనేది ఎక్కువ శాతం పిందె కట్టడానికి ఉవయోగపడుతుంది. అలాగే పిందె బఠాణి సైజు నుండి గోళీ సైజులో ఉన్నప్పుడు ఎక్కువగా పిందెరాలడం జరుగుతుంది. ఈ దశలో కూడా ఒకసారి ఫ్లానోఫిక్స్‌, మందును ౩ మి.లీ. 15 లీ. నీటిలో కలిపి పిచికారి చేయడం ద్వారా మనం పిందె రాలటాన్ని అరికట్టవచ్చు.

READ ALSO : Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక

జనవరి చివరి వారంలో కాని ఫిబ్రవరి మొదటి వారంలో పిందెలు గోళీకాయ సైజులో ఉన్నప్పుడు నీరు పెట్టే తోటల్లో 10 సం॥ల వయసుగల తోటలకు సుమారు 1100 గ్రా యూరియా, 750 (గ్రా. మ్యూలేట్‌ అఫ్‌ పొటాష్‌ ఎరువును అందించినట్లయితే చెట్టుకు మంచి పోషణ జరిగి పిందె రాలడం తగ్గడమే కాకుండా పిందె ఎదుగుదలకు కూడా ఎరువులు తోర్బడతాయి. ఈ ఎరువులు వేసిన వెంటనే నీరు పెట్టాలి. ఎరువులు వేసే ముందు చెట్ల మొదళ్ళ దగ్గర ఉన్న కలువును తీసివేయాలి. చెట్టు మొదలు నుండి 15-20 మీ. దూరంలో గాడి తీసి అందులో ఎరువులు వేసి మట్టితో కప్పాలి.

READ ALSO : Intercrops In Palm Oil : పామాయిల్ లో అంతర పంటలుగా కోకో, మిరియాల సాగు

డ్రిప్‌ ద్వారా నీరు పెట్టే తోటల్లో నీటిలో కరిగే ఎరువులను ఫెర్టిగేషన్‌ పద్దతుల్లో అందించాలి. రాయి నేలల్లో మరియు తేలికపాటి నేలల్లో సూక్ష్మపోషక లోపాలు కనిపించే అవకాశం ఉంది. ఒక్కోసారి అవి కనిపించకపోయినా అంతర్గతంగా లోపం ఉండే అవకాశం ఉంది. అందువల్ల కొత్త ఇగురు వచ్చేటప్పుడు, పూత ప్రారంభదశలో ఫార్యులా-4 లేదా ఐ.ఐ. హెచ్‌ఆర్‌ మాంగో స్పెషల్‌ సూక్ష్మధాతువు మిశ్రమాన్ని లీటరు నీటికి 5 గ్రా. చొప్పున పిచికారి చేయడం మంచిది.

నీటి యాజమాన్యం ; పిందె కట్టి, బఠాణి నుండి గోళికాయ సైజులో ఉన్నప్పటి నుండి కాయ ఎదిగే వరకు కనీసం 4 తడులు నీరివ్వాలి. ఫిబ్రవరి మొదటి వారంలో ఎరువులు వేసిన తరువాత ప్రతి 15 రోజుల వ్యవధికి ఒకసారి నీరు పెట్టడం మంచిది. దీని ద్వారా కాయ ఎదుగుదల బాగా జరిగి మంచి దగుబడిని పొందవచ్చు. కాయ కోతకు వచ్చే ముందు 10 రోజుల ముందు నుండి నీరు పెడ్డటం ఆపాలి.