Sesame Cultivation : వేసవి నువ్వు సాగులో చీడపీడల నివారణ

వాతావరణంలో ఎక్కువ చలి ఉండడం వల్ల పంటకి బూడిద తెగులు ఎక్కువగా అశించే అవకాశం ఉంటుంది. ఈ తెగులు వల్ల అకులు మరియు కాయలపై బూడిద రంగు పదార్థం ఏర్పడి కిరణజన్య సంయోగక్రియ తగ్గిపోతుంది. తద్వారా మొక్కల్లో ఎదుగుదల తగ్గటం మాత్రమే కాకుండా దిగుబడితో పాటుగా గింజనాణ్యత కూడా తగ్గుతుంది.

Sesame Cultivation : వేసవి నువ్వు సాగులో చీడపీడల నివారణ

Sesame Farming

Sesame Cultivation : తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వేసవిలో నువ్వు పంటను సాగు చేస్తారు. పసుపు, మిరప, పత్తి పండించిన నేలల్లో రెండవ పంటగా నువ్వు పంట వేసుకోవటానికి అనుకూలంగా ఉంటాయి. డ్రిప్ పద్ధతిలో నువ్వుసాగు వల్ల అధిక దిగుబడులు పొందవచ్చు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా అధిక దిగుబడి పొందేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నువ్వులో చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది. వీటి నుండి పంటను కాపాడుకునేందుకు కొన్ని జాగ్రత్త చర్యలు తప్పనిసిరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

READ ALSO : Bathukamma 2023 : పూల సంబురంలో ఏడో రోజు వేపకాయల బతుకమ్మ .. ఈరోజు ప్రసాదాల ప్రత్యేకత ఇదే..

నువ్వు పంటలో చీడపీడల యాజమాన్యం ;

గడ్డి చిలక , గొంగళి పురుగు ;

విత్తిన 20 రోజులలోపు గడ్డిచిలుక మరియు గొంగళి పురుగులు మొలకెత్తే మొక్కల మొదళ్ళను / మొగిని కొట్టివేయడం వల్ల మొక్క ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. గడ్జిచిలుక నివారణకు రక్షకపంటగా.జొన్న వేయటంతో పాటు గట్లు / పరిసరాలు శుభ్రంగా ఉందాలి. ఉద్భతి ఎక్కువైన పరిస్థితుల్లో 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్‌ లేదా 15 గ్రాః ఎసిఫేట్‌ లేదా 20 మి.లీ. ప్రాఫినోఫాస్‌ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. గొంగళివురుగు నివారణకు పెసరను ఎరపంటగా వేయడంతోపాటు ఎక్కువ ఉద్భతి గమనించినటైతే 1.0 గ్రా. ధయోదికార్బ్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

READ ALSO : Nayanthara : కొడుకుకి పాదసేవ చేసుకుంటున్న నయనతార.. లేడీ సూపర్ స్టార్ అయినా అమ్మే కదా..

రసం పీల్చే పురుగులు:

విత్తిన 20-25 రోజుల దశలో పంటను రనంపీల్చే పురుగులు తామరపురుగులు, పేనుబంక అకునల్లి మరియు ఇతర పురుగులు ఆశిస్తాయి. వీటి వల్ల అకులు ముందుగా ముడుచుకుపోయి, పాలిపోయి తర్వాత దశలో తామర పురుగులు మరియు పేనుబంక నివారణకు లీటరు నీటికి 16మిలీ. మోనోక్రోటోఫాస్‌ లేదా 20 మి.లీ. డైమిథోయేట్‌ లేదా 03 మి.లీ. ఇమిదాళ్లోపిద్‌ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్‌ మరియు అకు నల్లి నివారణకు 20 డైమిథోయేట్‌ లేదా 60 మిలీ. డైకోఫాల్‌ కలిపి పిచికారి చేయాలి.

READ ALSO : Rahul Gandhi – Kodandaram : కరీంనగర్ లో రాహుల్ గాంధీ, కోదండరామ్ భేటీ.. పొత్తు, సీట్ల కేటాయింపుపై చర్చ

ఆకు గూడు పురుగు, కాయతొలుచు పురుగు ; ఆకుగూడు పురుగు ఆకులతో గూడు కట్టి పచ్చని పదార్థాన్ని గీకి తినడం వల్ల అకులు ఎండిపొతాయి. మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను, పువ్వులను, కాయల్లోని లేతగింజలను తింటాయి. వీటి నివారణకు 20 మి.లీ. క్వినాల్‌ఫాన్‌ లేదా 25 మి.లీ, కోరపైరిఫాన్‌ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్‌ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెగుళ్ల నివారణ :

బూడిద తెగులు ;

వాతావరణంలో ఎక్కువ చలి ఉండడం వల్ల పంటకి బూడిద తెగులు ఎక్కువగా అశించే అవకాశం ఉంటుంది. ఈ తెగులు వల్ల అకులు మరియు కాయలపై బూడిద రంగు పదార్థం ఏర్పడి కిరణజన్య సంయోగక్రియ తగ్గిపోతుంది. తద్వారా మొక్కల్లో ఎదుగుదల తగ్గటం మాత్రమే కాకుండా దిగుబడితో పాటుగా గింజనాణ్యత కూడా తగ్గుతుంది. ఈ తెగులు నివారణకి లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1.0 గ్రా. కార్బండిజిమ్‌ లేదా 1.0 గ్రా
మైక్లోబుటానిల్‌ కలిపి పిచికారి చేయాలి.

READ ALSO : ODI World Cup 2023 : న‌న్ను కెమెరాలో చూపించ‌కండి.. నేను వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నా.. మా బాస్‌ను అలాగే అనుకోనివ్వండయ్యా..!

అల్దర్నేరియా, సెర్యోస్పోరా ఆకుమచ్చ తెగులు ;

అల్బర్నేరియా ఆకుమచ్చ తెగులు, పంట విత్తిన 20-25 రోజుల తర్వాత అకులపై వలయాకారప్తు గోధుమరంగు మచ్చలు ఏర్పడటం ద్వారా మొదలవుతుంది. ఈ మచ్చలు మొదట కింది ఆకులపైన ఏర్పడి లేత ఆకులకి వ్యాపించటమే కాకుండా కాండంపైన కూడా కనిపిస్తాయి. సెర్మోస్బోరా అకుమచ్చ తెగులు వలన ఆకుల అడుగు భాగంలో తుప్పు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి ఒక దానితో ఒకటి కలిసిపోయి అకులు ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు 1గ్రా. కారండిజిమ్‌ లేదా 25 గ్రా. మాంకోజెబ్‌ లీటరు. నీటిలో కలివి 15 రోజుల వ్వవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.

READ ALSO : Viral Video : ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. రెచ్చిపోయిన దొంగలు, మార్షల్ ఆర్ట్ ప్రయోగించి దోపిడీ, తీవ్ర భయాందోళనలో ప్రజలు

వెర్రితెగులు:

సాధారణంగా అలస్యంగా వేసిన పంటలో, పూత నమయంలో వెరికగులు (లోది) ఎక్కవగా వస్తుంది. మొక్క్లోని అకులు చిన్ఫవిగా మారి వూత ఏర్పడదు. ఈతెగులు మైకోప్లాస్మా ద్వారా సంభవించి పచ్చదోమ ద్వారా వ్యాప్తిచెందుతుంది.. కావున వెర్రితెగులు సోకిన మొక్కలని పీకి కాల్చివేయాలి. పచ్చదోమ అరికట్టడానికి 15 మి.లీ. మిథైల్‌డెమెటాన్‌ లేదా 20 మి.ల్‌. డైమిథోయేట్‌ లేదా1.5 గ్రా. ఎసిఫేట్‌ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.