Viral Video : ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. రెచ్చిపోయిన దొంగలు, మార్షల్ ఆర్ట్ ప్రయోగించి దోపిడీ, తీవ్ర భయాందోళనలో ప్రజలు

దొంగలు ఒకప్పుడు కత్తులు, కటార్లు చూపి బెదిరించి చోరీలకు పాల్పడేవారు. ఇప్పుడు స్టైల్ మారింది. ఆయుధం లేకుండానే అటాక్ చేస్తున్నారు. Delhi Robbery

Viral Video : ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. రెచ్చిపోయిన దొంగలు, మార్షల్ ఆర్ట్ ప్రయోగించి దోపిడీ, తీవ్ర భయాందోళనలో ప్రజలు

Delhi Robbery Viral Video (Photo : Google)

Delhi Robbery Viral Video : దేశ రాజధాని ఢిల్లీలో శాంతిభద్రతల అంశం ఆందోళనకు గురి చేస్తోంది. దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేదు. నడిరోడ్డుపై పబ్లిక్ లోనే యధేచ్చగా దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇంకా షాకింగ్ కలిగించే విషయం ఏంటంటే.. ఒకప్పుడు కత్తులు, కటార్లు చూపి బెదిరించి చోరీలకు పాల్పడేవారు. ఇప్పుడు దొంగల స్టైల్ మారింది. ఆయుధం లేకుండానే అటాక్ చేస్తున్నారు. దొరికినంత దోచుకుని పారిపోతున్నారు. ఆత్మరక్షణ కోసం వాడాల్సిన మార్షల్ ఆర్ట్స్ ని దారిదోపిడీలకు వాడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన ఓ దోపిడీ సంచలనంగా మారింది. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. మర్మ కళను ఉపయోగించి దొంగతనం చేసి తీరు షాక్ కి గురి చేస్తోంది.

వెస్ట్ ఢిల్లీలోని హరి నగర్ ఏరియాలో దోపిడీ జరిగింది. ముగ్గురు దొంగలు ఓ స్క్రాప్ డీలర్ ని దోచుకున్నారు. ముగ్గురు దొంగల్లో ఒకడు స్క్రాప్ డీలర్ ని వెనుక నుంచి అటాక్ చేశాడు. జియు జిత్ సు (jiu jitsu) ఉపయోగించి అతడి గొంతుని గట్టిగా నొక్కేశాడు. దాంతో ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడు. ఇంతలో మరో దొంగ వచ్చి స్క్రాప్ డీలర్ జేబులో ఉన్న 3వేల 200 రూపాయలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు.

Also Read : ఆ 2 నిమిషాల ఎంజాయ్‭కి బదులు అమ్మాయిలు కోరికల్ని నియంత్రించుకోవాలి.. కోర్టు సంచలన వ్యాఖ్యలు

పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఈ దోపిడీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముగ్గురు దొంగల్లో ఒకడు మార్షల్ ఆర్ట్ ని ప్రయోగించాడు. దాన్ని జియు జిత్ సు అంటారు. అదో మార్షల్ ఆర్ట్, కంబాట్ స్పోర్ట్. ఇంకా చెప్పాలంటే అదొక బ్రెజీలియన్ టెక్నిక్. బ్రెయిన్ కి ఆక్సిజన్, రక్త సరఫరా కాకుండా ఆపే టెక్నిక్ అది. కొన్ని సెకన్లలోనే బాధితుడు అపస్మాకర స్థితికి చేరుకుంటాడు.

ముగ్గురు దొంగల్లో ఒకడు ఈ టెక్నిక్ కి ప్రయోగించాడు. స్క్రాప్ డీలర్ వెనుక నుంచి వెళ్లి తన చేతితో గట్టిగా అతడి గొంతు అదిమి పట్టాడు. అంతే, ఆ స్క్రాప్ డీలర్ చూస్తుండగానే స్పృహ తప్పిపడిపోయాడు. ఆ వెంటనే దొంగలు అతడి దగ్గర డబ్బు దోచుకుని అక్కడి నుంచి పారిపోయారు.

Also Read : ఐదు నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తానని చెప్పింది.. కానీ

చోరీ జరిగిన తీరు స్థానికులను షాక్ కి గురి చేసింది. వామ్మో అని భయపడిపోతున్నారు. మార్షల్ ఆర్ట్ ఉపయోగించి దొంగతనం చేసిన తీరు స్థానికులను భయాందోళనకు గురి చేసింది. అక్టోబర్ 16వ తేదీన ఫతేనగర్ లోని గురుద్వార దగ్గర ఈ చోరీ జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ ముగ్గురు దొంగలను పట్టుకున్నారు.