Calcutta High Court: ఆ 2 నిమిషాల ఎంజాయ్‭కి బదులు అమ్మాయిలు కోరికల్ని నియంత్రించుకోవాలి.. కోర్టు సంచలన వ్యాఖ్యలు

అదే సమయంలో టీనేజర్ల (16 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు) లైంగిక చర్యలను నేరంగా పరిగణించాలని కోర్టు పిలుపునిచ్చింది. కానీ వారి సంబంధం ఏకాభిప్రాయం, హక్కుల ఆధారిత లైంగిక విద్యను కూడా కోర్టు కోరింది.

Calcutta High Court: ఆ 2 నిమిషాల ఎంజాయ్‭కి బదులు అమ్మాయిలు కోరికల్ని నియంత్రించుకోవాలి.. కోర్టు సంచలన వ్యాఖ్యలు

Updated On : October 19, 2023 / 4:35 PM IST

Calcutta High Court: అత్యాచారం కేసులో నిందితుడిని నిర్దోషిగా కలకత్తా హైకోర్టు తాజాగా విడుదల చేసింది. అయితే ఈ సందర్భంలో యువతను ఉద్దేశించి కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. యువతులు రెండు నిమిషాల పాటు ఎంజాయ్ చేసే బదులు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని గురువారం కోర్టు పేర్కొంది. అలాగే మహిళలు, అమ్మాయిల గౌరవాన్ని అబ్బాయిలు కాపాడాలంటూ చురకలు అంటించింది.

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో యువకుడిని నిర్దోషులుగా ప్రకటిస్తూ జస్టిస్ చిత్తరంజన్ దాస్, జస్టిస్ పార్థ సారథి సేన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. వాస్తవానికి ఇద్దరి ఇష్టంతోనే లైంగిక సంబంధం పెట్టుకున్నప్పటికీ, తర్వాత యువకుడిపై అత్యాచారం కేసు మోపారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో)పై కూడా కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. టీనేజర్ల మధ్య ఏకాభిప్రాయ సంబంధాలను లైంగిక దోపిడీగా అభివర్ణిస్తున్నారని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Supriya Slams Himanta: ‘కుమార్తెను గాజా పంపిస్తున్న శరద్ పవార్’ వ్యాఖ్యపై సీఎం హిమంత బిశ్వాది కూడా ఒకటే డీఎన్ఏ అంటూ సుప్రియా ఘాటు రిప్లై

అదే సమయంలో టీనేజర్ల (16 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు) లైంగిక చర్యలను నేరంగా పరిగణించాలని కోర్టు పిలుపునిచ్చింది. కానీ వారి సంబంధం ఏకాభిప్రాయం, హక్కుల ఆధారిత లైంగిక విద్యను కూడా కోర్టు కోరింది. ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్ టెస్టోస్టెరాన్ స్త్రీలు, పురుషులలో సంభవిస్తుందని కోర్టు పేర్కొంది. టీనేజర్లలో సెక్స్ అసాధారణం కాదని కోర్టు పేర్కొంది. కానీ లైంగిక కోరిక కొన్ని విషయాలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.

అమ్మాయిలు, అబ్బాయిలు తమ విధులను గౌరవించాలని యువతకు కోర్టు సూచించింది. మగపిల్లలకు స్త్రీల పట్ల గౌరవం ఉండాలని, టీనేజర్లకు మార్గదర్శకత్వం అవసరమని, ఇది ఇంటి నుండే ప్రారంభం కావాలని కలకత్తా కోర్టు స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Mumbai : రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవడానికి వచ్చిన దివ్యాంగురాలికి చేదు అనుభవం .. స్పందించిన మంత్రి