Mumbai : రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవడానికి వచ్చిన దివ్యాంగురాలికి చేదు అనుభవం .. స్పందించిన మంత్రి
పెళ్లి చేసుకోవడానికి రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్లిన దివ్యాంగురాలికి చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగింది?

Mumbai
Mumbai : రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవడానికి వెళ్లిన ఓ దివ్యాంగురాలికి చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మహారాష్ట్ర మంత్రి ఫడ్నవిస్ స్పందించారు.
దివ్యాంగురాలు.. దివ్యాంగుల హక్కుల కార్యకర్త, మోడల్ విరాలీ మోడీ ముంబయి ఖార్‌లోని రిజిస్ట్రార్ ఆఫీసులో రీసెంట్‌గా తన వివాహం చేసుకోవడానికి వచ్చారు. అక్కడ ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసారు. దివ్యాంగులు వెళ్లేందుకు వీలు లేకుండా కార్యాలయం రెండవ అంతస్తులో ఉందని.. లిఫ్ట్ కూడా అందుబాటులో లేకపోవడంతో తనను రెండవ అంతస్తులోకి తీసుకువెళ్లాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు. మెట్లు నిటారుగా ఉండటం.. రైలింగ్ వదులుగా ఉండటంతో పాటు తుప్పు పట్టి ఉన్నాయని తనకు సాయం చేయడానికి కార్యాలయంలో ఎవరూ ముందుకు రాలేదని విరాలీ మోడీ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
‘దయ చేసి చెప్పండి. నేను దివ్యాంగురాలిని. 16-10-23 న ఖార్ ముంబయిలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నాను. కార్యాలయం లిఫ్ట్ లేకుండా 2 వ అంతస్తులో ఉంది. సంతకాల కోసం వారు కిందకి రారు.. పెళ్లి చేసుకోవడానికి నేను రెండవ అంతస్తు మెట్లు ఎక్కాల్సి వచ్చింది’ అనే శీర్షికతో విరాలీ మోడీ తన వివాహ ధృవీకరణ పత్రాన్ని చూపించే ఫోటోలను తను ఎదుర్కున్న ఇబ్బందిని ట్విట్టర్‌లో షేర్ చేసారు.
Sameer Wankhede : ముంబయి క్రూయిజ్ డ్రగ్ కేసు విచారించిన సమీర్ వాంఖడేకు బెదిరింపు
విరాలీ ట్వీట్ వైరల్ కావడంతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ముందుగా విరాలీ మోడీ దంపతులకు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని.. ఈ విషయంలో తను వ్యక్తిగతంగా కలగజేసుకుని తగిన చర్యలు తీసుకుంటామని’ వెల్లడించారు. నెటిజన్లు సైతం దివ్యాంగుల సౌకర్యాలకు, వారికి అందాల్సిన సేవలను హైలైట్ చేస్తూ కామెంట్లు పెట్టారు.
PLEASE RT!
I am disabled and I got married at the Registrars Office at Khar Mumbai on 16/10/23. The office was on the 2nd floor WITHOUT a lift. They wouldn’t come downstairs for the signatures and I had to be carried up two flights of stairs to get married. pic.twitter.com/ZNCQF3gJRY
— Virali Modi (@Virali01) October 18, 2023
First of all many congratulations on the new beginnings and wishing you both a very happy and a beautiful married life !
Also I really am sorry for the inconvenience caused to you.
I have personally taken cognisance and will take corrective and appropriate action. @Virali01— Devendra Fadnavis (@Dev_Fadnavis) October 18, 2023