ODI World Cup 2023 : న‌న్ను కెమెరాలో చూపించ‌కండి.. నేను వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నా.. మా బాస్‌ను అలాగే అనుకోనివ్వండయ్యా..!

మ‌న‌దేశంలో క్రికెట్ అనేది ఓ ఆట కాదు. ఓ మ‌తంలా భావిస్తారు అన్న సంగ‌తి తెలిసిందే. సాధార‌ణంగా టీవీల్లో వ‌చ్చే మ్యాచ్ చూసేందుకే స్కూళ్ల‌కు, కాలేజీల‌కు బంక్‌లు కొడ‌తారు.

ODI World Cup 2023 : న‌న్ను కెమెరాలో చూపించ‌కండి.. నేను వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నా.. మా బాస్‌ను అలాగే అనుకోనివ్వండయ్యా..!

A Team India Fan placard during Ind vs Ban match

Updated On : October 19, 2023 / 8:42 PM IST

ODI World Cup : మ‌న‌దేశంలో క్రికెట్ అనేది ఓ ఆట కాదు. ఓ మ‌తంలా భావిస్తారు అన్న సంగ‌తి తెలిసిందే. సాధార‌ణంగా టీవీల్లో వ‌చ్చే మ్యాచ్ చూసేందుకే స్కూళ్ల‌కు, కాలేజీల‌కు బంక్‌లు కొడ‌తారు. అదే గ్రౌండ్ కి వెళ్లి ప్ర‌త్య‌క్షంగా మ్యాచ్ చూసేందుకు అవ‌కాశం ఉంటే.. అది కూడా ఆషామాషీ మ్యాచ్ కాదు.. వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ అయితే.. ఇక చెప్పేది ఏముంది.? ఎవ‌రు మాత్రం ఆ అవ‌కాశాన్ని వ‌దులుకుంటారు చెప్పండి. త‌గ్గేదేలే ఏం జ‌రిగినా..? ఎలాగైనా స‌రే మ్యాచ్ చూసేందుకు ప్రాధాన్యం ఇస్తారు అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

క‌రోనా పుణ్య‌మా అని చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ జాబ్‌లు చేస్తున్నారు. వీరిలో ఎక్కువ‌గా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉన్నారు. కొంత మంది ఆఫీసుల‌కు వెలుతున్నా.. ఇంకొంద‌రు మాత్రం ఇంటి నుంచే ప‌ని చేస్తున్నారు. ఇక ఇంటి నుంచి ప‌ని చేసే వారు నిజంగా ప‌ని చేస్తున్నారో..? లేదో తెలుసుకోవ‌డం కొంచెం క‌ష్ట‌మైన ప‌నే. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌లో కొంద‌రు త‌మ‌కు ఏదైన బ‌య‌ట‌కు వెళ్లే ప‌ని ఉంటే.. సెల‌వు తీసుకోకుండా అప్ప‌గించిన ప‌నిని చాలా తొంద‌ర‌గా పూర్తి చేసి బ‌య‌ట‌కు వెళ్లి ఆ ప‌నిని చేసుకుంటున్నారు. తాజాగా ఓ వ్య‌క్తి కూడా ఇలాగే చేశాడు.

Mushfiqur Rahim : ముష్ఫిక‌ర్ ర‌హీం అరుదైన ఘ‌న‌త.. భార‌త్‌తో మ్యాచ్‌లోనే అందుకోవాలా..?

పూణే వేదిక‌గా ఇండియా, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో స్టాండ్స్‌లోని ఓ వ్య‌క్తి ఫ్ల‌కార్డు ప‌ట్టుకుని నిలుచొగా.. కెమెరాలు అన్ని ఒక్క‌సారిగా అత‌డిని జూమ్ చేశాయి. అత‌డు ప‌ట్టుకున్న ఫ్లకార్డులో.. ‘న‌న్ను కెమెరాల్లో చూపించ‌కండి. నేను వ‌ర్క్ ప్ర‌మ్ హోమ్ చేస్తున్నా అని మా బాస్ అనుకుంటున్నాడు.’ అని రాసి ఉంది. ప్ర‌స్తుతం ఈ పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

వ‌ర్క్ ప్ర‌మ్ హోమ్ బాగానే చేస్తున్నావు అని ఓ నెటీజ‌న్ అన‌గా.. నిజంగా నువ్వు క్రికెట్‌కు వీరాభిమాని భ‌య్యా అంటూ మ‌రొక‌రు అన్నారు. వ‌ర్క్ ప్ర‌మ్ హోమ్ కాదు భ‌య్యా వ‌ర్క్ ఫ్ర‌మ్ గ్రౌండ్ అంటూ ఇంకొక‌రు అన్నారు. ఇది క‌నుక బాస్‌కి తెలిస్తే ట‌ర్మినేష‌న్ అండ‌ర్ ప్రాసెస్‌.. మీ సేవ‌ల‌కు ధ‌న్య‌వాదాలు అంటాడు జాగ్ర‌త్త‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ODI World Cup 2023 : అనుకోకుండా.. ఓ బాలుడి కోరికను తీర్చిన కోహ్లీ.. అదే కోరిక‌ను రోహిత్ శ‌ర్మ తీర్చ‌లేక‌పోయాడు..?