ODI World Cup 2023 : అనుకోకుండా.. ఓ బాలుడి కోరికను తీర్చిన కోహ్లీ.. అదే కోరికను రోహిత్ శర్మ తీర్చలేకపోయాడు..?
టీమ్ఇండియాలో ప్రస్తుతం క్రికెట్ ఆడే ఆటగాళ్లలో స్టార్ ఆటగాళ్లు ఎవరంటే ఠకున్న చెప్పే సమధానం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. వీరు ఇద్దరూ తమదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ జట్టుకు ఒంటి చేత్తో ఎన్నో సార్లు విజయాలను అందించారు.

Unexpectedly Virat Kohli fulfilled a boy wish
ODI World Cup : టీమ్ఇండియాలో ప్రస్తుతం క్రికెట్ ఆడే ఆటగాళ్లలో స్టార్ ఆటగాళ్లు ఎవరంటే ఠకున్న చెప్పే సమధానం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. వీరు ఇద్దరూ తమదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ జట్టుకు ఒంటి చేత్తో ఎన్నో సార్లు విజయాలను అందించారు. అయితే.. విరాట్ కోహ్లీ అనుకోకుండా ఓ బాలుడి కోరికను తీర్చాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పూణే వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ ఈ పనిని చేశాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. అదే బాలుడి కోరికను మాత్రం రోహిత్ శర్మ తీర్చలేదు. ఆ కోరికను రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లోనే కాదు వన్డే ప్రపంచకప్‌లోనూ తీర్చడం కష్టమే
ఇంతకీ ఆ బాలుడి కోరిక ఏమిటంటే..?
టీమ్ఇండియాకు అభిమాని అయిన ఓ బాలుడు పూణె వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ చూసేందుకు వచ్చాడు. అతడు చేతిలో ఓ ఫ్లకార్డు పట్టుకుని స్టాండ్స్‌లో నిలుచుకున్నాడు. ఆ ఫ్లకార్డులో ఈ రోజు జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ, కోహ్లీలు బౌలింగ్ చేస్తారా..? అని రాసి ఉంది. అయితే.. యాదృశ్చికంగా ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేశాడు. మూడు బంతులు వేసి రెండు పరుగులు ఇచ్చాడు.
హార్దిక్ గాయపడడంతో..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌ను హార్దిక్ పాండ్య వేశాడు. మొదటి రెండు బంతులను లిటన్ దాస్ ఫోర్లుగా మలిచాడు. మూడో బంతి వేయగా స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. ఆ బంతిని ఆపే క్రమంలో హార్దిక్ జారి కిందపడ్డాడు. అతడి ఎడమ కాలికి గాయమైంది. ఫిజియో వచ్చి అతడికి ప్రాథమిక చికిత్స అందించాడు. అయితే.. హార్దిక్ సరిగ్గా నిలుచుకునేందుకు కూడా ఇబ్బంది పడ్డాడు. అతడు మైదానాన్ని విడిచి వెళ్లాడు.
దీంతో ఈ ఓవర్‌లో మిగిలిన మూడు బంతులను విరాట్ కోహ్లీ వేశాడు. దాదాపు 8 సంవత్సరాల తరువాత విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచకప్‌లో బౌలింగ్ చేయడం గమనార్హం. మూడు బంతులు వేసిన విరాట్ రెండు పరుగులు ఇచ్చాడు. ఇలా అనుకోకుండా ఆ బాలుడి కోరికను విరాట్ కోహ్లీ నెరవేర్చాడు. ప్రస్తుతం ఆ బాలుడు ఫ్లకార్డు పట్టుకున్న ఫోటో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఆ బాలుడి కోరికను కోహ్లీ నెరవేర్చాడు.. రోహిత్ నెరవేర్చలేదని అంటున్నారు.
Virat Kohli : ఇదీ చూశారా.. 8 ఏళ్ల తరువాత విరాట్ కోహ్లీ బౌలింగ్.. సూపరో సూపర్.. వీడియో వైరల్
Virat Kohli fulfilled his wish..#INDvBAN #ODIWorldCup2023 #ICCWorldCup2023 #INDvsBAN pic.twitter.com/KvZ6VmWzQ2
— RVCJ Media (@RVCJ_FB) October 19, 2023