Bathukamma 2023 : పూల సంబురంలో ఏడో రోజు వేపకాయల బతుకమ్మ .. ఈరోజు ప్రసాదాల ప్రత్యేకత ఇదే..

బతుకు అమ్మా అంటే ఆడబిడ్డలను ఆశీర్వదించే పండుగ. బతుకమ్మ అంటే తెలంగాణ ఆడపడుచులకు ఆరోప్రాణం. తమ ఇంటి ఆడబిడ్డగా బతుకమ్మను కొలుస్తారు. పాటలతో కీర్తిస్తారుజ తమను సౌభాగ్యవతులుగా దీవించాలని కోరుకుంటారు.

Bathukamma 2023 : పూల సంబురంలో ఏడో రోజు వేపకాయల బతుకమ్మ .. ఈరోజు ప్రసాదాల ప్రత్యేకత ఇదే..

vepakayala bathukamma

Bathukamma 2023 : తెలంగాణలో బతుకమ్మ సంబరాలు పూల పరిమళాలతో గుభాళిస్తున్నాయి. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ పండుగలో అప్పుడే ఏడవ రోజు వచ్చసింది. మొదటి రోజు ఎంగిలిపువ్వు బతుకమ్మ, రెండోరోజు అటుకల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మలు ముగిశాయి. ఈరోజు ఏడో రోజు.. అంటే వేపకాయల బతుకమ్మ పండుగ. ఆరో రోజు అలిగిన బతుకమ్మను పేర్చని, ఆడని ఆడబిడ్డలు ఏడో రోజు తిరిగి బతుకమ్మను రంగు రంగుల పూలతో పేర్చి ఆడిపాడుతారు.

బతుకు అమ్మా అని ఆడబిడ్డలను ఆశీర్వదించే పండుగ. బతుకమ్మ అంటే తెలంగాణ ఆడపడుచులకు ఆరోప్రాణం. తమ ఇంటి ఆడబిడ్డగా బతుకమ్మను కొలుస్తారు. పాటలతో కీర్తిస్తారు. తమను సౌభాగ్యవతులుగా దీవించాలని వేడుకుంటారు. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు..సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. తొమ్మిది రోజులు తెలంగాణలోనే కాదు విదేశాల్లో ఉండే తెలంగాణ ఆడబిడ్డలంతా బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఇక తెలంగాణలో బతుకమ్మ పండుగ జరిగే తొమ్మిది రోజు ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా ఆడబిడ్డల సందడితో పాటు పూల సందడి కనిపించి కనువిందు చేస్తుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.

Bathukamma 2023 : ఆరో రోజు అలిగిన బతుకమ్మ .. అలక వెనుక ఆసక్తికర కథలు

ఈ బతుకమ్మ పండుగలో భాగంగా ఏడవరోజు ‘వేపకాయల బతుకమ్మ’గా జరుపుకుంటారు. ఈ రోజు బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబి పూలతో ఏడంతరాలు పేర్చి ఆడుకొని చెరువులో నిమజ్జనం చేస్తారు. వేపకాయల బతుకమ్మ వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకే వేపకాయల బతుకమ్మ అంటారు. అలాగే పప్పు, బెల్లం నైవేద్యంగా పెడతారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన సంబురాలు తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగియనున్నాయి.