Home » MLC Ananthababu
తాను గేట్ పక్కనే ఉంటానని.. అలాంటిది ఏం జరిగినా తమకు తెలుస్తుందని వాచ్‌మెన్ అంటున్నారు. అంతేగాక శంకర్ టవర్స్‌కు అసలు సుబ్రమణ్యం రానే రాలేదని వాచ్‌మెన్ అంటున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు అబద్ధాలు చెబుతున్నారంటున్నారు.
సుబ్రమణ్యాన్ని వేరే వ్యక్తితో అనంత పిలిపించినట్లు వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులు మాత్రం స్వయంగా అనంతబాబే అతన్ని తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. పథకం ప్రకారం జరిగిన హత్య కాదంటున్నారు.
మరోవైపు ఈ ఘటన జరిగిన రోజు ఎమ్మెల్సీతో పాటు ఎవరెవరు ఉన్నారో వివరాలు సేకరిస్తున్నారు. ఇంటి దగ్గర్నుంచి సుబ్రమణ్యాన్ని తీసుకెళ్లడం, ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లడం తిరిగి ఇంటికి తీసుకురావడం వరకు సీన్ రీకన్స్‌ట్రక్షన్ చేయనున్నారు.