Subramaniam Murder : సుబ్రమణ్యం హత్య కేసులో కొత్త ట్విస్ట్‌

తాను గేట్‌ పక్కనే ఉంటానని.. అలాంటిది ఏం జరిగినా తమకు తెలుస్తుందని వాచ్‌మెన్ అంటున్నారు. అంతేగాక శంకర్‌ టవర్స్‌కు అసలు సుబ్రమణ్యం రానే రాలేదని వాచ్‌మెన్ అంటున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు అబద్ధాలు చెబుతున్నారంటున్నారు.

Subramaniam Murder : సుబ్రమణ్యం హత్య కేసులో కొత్త ట్విస్ట్‌

Subramaniam

Updated On : May 24, 2022 / 11:36 AM IST

Subramaniam murder : సుబ్రమణ్యం హత్యను ఎమ్మెల్సీ అనంతబాబు పక్కా ప్లాన్‌ ప్రకారమే చేశారా? పోలీసులకు కట్టు కథ చెప్పి కళ్లు గప్పారా? శంకర్‌ టవర్స్‌ దగ్గర అనంతబాబుకు, సుబ్రమణ్యానికి అసలు ఘర్షణే జరగలేదా? శంకర్‌ టవర్స్‌ దగ్గరికి వచ్చేసరికే సుబ్రమణ్యం మరణించాడా? అంటే ఔననే అంటున్నారు శంకర్‌ టవర్స్‌ వాచ్‌మెన్‌, సుబ్రమణ్యం చిన్నాన్న. అసలు హత్య జరిగిన రోజు రాత్రి శంకర్ టవర్స్‌ దగ్గర అసలు ఎలాంటి ఘర్షణ జరగలేదని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

తాను గేట్‌ పక్కనే ఉంటానని.. అలాంటిది ఏం జరిగినా తమకు తెలుస్తుందని వాచ్‌మెన్ అంటున్నారు. అంతేగాక శంకర్‌ టవర్స్‌కు అసలు సుబ్రమణ్యం రానే రాలేదని వాచ్‌మెన్ అంటున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు అబద్ధాలు చెబుతున్నారంటున్నారు. అనంతబాబు సాయంత్రం 4 గంటలు వెళ్లారని.. మళ్లీ రాత్రి ఒంటిగంటకే తిరిగి వచ్చారని.. ఆ సమయంలో అనంతబాబుతో మేడమ్‌ కూడా ఉన్నారని తెలిపారు. రాత్రి ఒంటిగంటకు అనంతబాబు భార్యతో కలిసి పైకి వెళ్లారని.. మళ్లీ కిందకు అనంతబాబు ఒక్కరే వచ్చారన్నారు.

Ananthababu Remand : ఎమ్మెల్సీ అనంతబాబుకు 14రోజుల రిమాండ్

అపార్ట్‌మెంట్‌లో ఉన్న సీసీ ఫుటేజీని ఇప్పటికే పోలీసులు తీసుకున్నారని.. అందులో కూడా ఎలాంటి గొడవ రికార్డ్‌ కాలేదని సుబ్రమణ్యం చిన్నాన్న చెప్పారు. సుబ్రమణ్యం చిన్నాన్న చెబుతుందే నిజమైతే అనంతబాబు పోలీసులకు కట్టు కథ చెప్పినట్టు కన్‌ఫామ్‌ అయినట్టే. రాత్రి ఒంటిగంట సమయంలో అనంతబాబుతో ఆయన భార్య కూడా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. సుబ్రమణ్యం హత్య జరిగినప్పుడు ఆయన భార్య కూడా అక్కడే ఉన్నారా? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.