Home » Music Director Raj Passes Away
ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత
గతంలో ఇద్దర్ని దీని గురించి ప్రశ్నిస్తే మేము వర్క్ పరంగానే విడిపోయాము, సంగీత దర్శకులుగానే విడిపోయాము అంతేకాని ఎప్పటికి స్నేహితులమే, కనిపిస్తే మాట్లాడుకుంటాం అని అన్నారు. అయితే రాజ్ - కోటిలను విడిపోయాక కలపాలని కొంత మంది చూశారు.
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజ్ నిన్న సాయంత్రం గుండెపోటుతో హైదరాబాద్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది.
1950, 60 దశకాల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు రాజ్ తండ్రి టీవీ రాజు సంగీత దర్శకత్వం అందించారు. ఆయన పూర్తి పేరు తోటకూర వెంకట రాజు. 1950ల్లో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన టీవీ రాజు ఆయన సంగీతంతో ఎన్టీఆర్ గారిని మెప్పించి ఎన్టీఆర్ నిర్మాణ సంస్థలో ఆస్థా�