Music Director Raj : మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ తండ్రి ఎవరో తెలుసా? ఎన్టీఆర్ చాలా సినిమాలకు ఆయనే మ్యూజిక్ డైరెక్టర్..
1950, 60 దశకాల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు రాజ్ తండ్రి టీవీ రాజు సంగీత దర్శకత్వం అందించారు. ఆయన పూర్తి పేరు తోటకూర వెంకట రాజు. 1950ల్లో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన టీవీ రాజు ఆయన సంగీతంతో ఎన్టీఆర్ గారిని మెప్పించి ఎన్టీఆర్ నిర్మాణ సంస్థలో ఆస్థాన విధ్వంసులు అయిపోయారు.

Music Director Raj Passes Away his father TV Raju also famous Music Director
TV Raju : ప్రముఖ సంగీత దర్శకుడు(Music Director) రాజ్(Raj) నిన్న మే 21 సాయంత్రం మరణించారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. రాజ్ – కోటి సంగీత ద్వయం టాలీవుడ్ లో చాలా పాపులర్. రాజ్ పూర్తి పేరు తోటకూర సోమరాజు. మ్యూజిక్ డైరెక్టర్ కోటితో కలిసి రాజ్ దాదాపు 180 సినిమాలకు సంగీతం అందించారు. తెలుగులో రాజ్ – కోటి ద్వయం సూపర్ హిట్ కాంబినేషన్.
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజ్ నిన్న సాయంత్రం గుండెపోటుతో హైదరాబాద్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు. దీంతో సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు రాజ్ ఇంటికి వెళ్తున్నారు. రాజ్ తండ్రి టీవీ రాజు కూడా సంగీత దర్శకులే.
1950, 60 దశకాల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు రాజ్ తండ్రి టీవీ రాజు సంగీత దర్శకత్వం అందించారు. ఆయన పూర్తి పేరు తోటకూర వెంకట రాజు. 1950ల్లో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన టీవీ రాజు ఆయన సంగీతంతో ఎన్టీఆర్ గారిని మెప్పించి ఎన్టీఆర్ నిర్మాణ సంస్థలో ఆస్థాన విధ్వంసులు అయిపోయారు. ఎన్టీఆర్ నిర్మించిన, ఎన్టీఆర్ నటించిన అనేక సినిమాలకు టీవీ రాజే సంగీతం అందించారు. శ్రీకృష్ణరాజున యుద్ధం, మారిన మనిషి, కథానాయకుడు, భలే తమ్ముడు, వరకట్నం, తిక్క శంకరయ్య, శ్రీకృష్ణావతారం, పిడుగు రాముడు, భామ విజయం, శ్రీకృష్ణ పాండవీయం, పాండురంగ మహత్యం.. ఇలా ఎన్టీఆర్ నటించిన దాదాపు 20కు పైగా సినిమాలకు ఈయనే సంగీతం అందించారు.
Koti: రాజ్ మరణంపై ఎమోషనలైన కోటి.. మేమిద్దరం విడిపోవడానికి కారణం అదే
టీవీ రాజు సంగీత దర్శకుడు కావడంతో రాజ్ కూడా చిన్నప్పటి నుంచే సంగీతం నేర్చుకొని సంగీత దర్శకుడిగా మారాడు. చిన్నప్పటి నుంచి కోటి క్లోజ్ ఫ్రెండ్ కావడంతో ఇద్దరూ కలిసి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. కానీ కొన్నేళ్ల క్రితం రాజ్ – కోటి విడిపోయారు. వారిని కలపాలని చాలా మంది సినీ ప్రముఖులు ట్రై చేసినా ఫలితం లేకపోయింది. రాజ్ కన్నుమూతతో కోటి తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు.