Home » Onion Cultivation
ఎకరా పొలంలో విత్తుకోవటానికి 3నుంచి 4కిలోల విత్తనం సరిపోతుంది. నారు పెంపకానికి ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎంచుకున్న పొలాన్ని 3,4సార్లు బాగా దుక్కి దున్నుకోవాలి.
శనగపచ్చ పురుగు నివారణకు ఎకరాకు 20 వరకు పక్షిస్ధావరాలను ఏర్పాటు చేయాలి. ఎర పంటలుగా బంతి, ఆవాల మొక్కలను అక్కడక్కడా పొలంలో వేయాలి.
ఉల్లి పంటను ధాన్యపు పంటతో పంట మార్పిడి చేయాలి. ఎకరాకు 80 కిలోల చొప్పున వేప పిండిని వేయడం వల్ల నులిపురుగులు మరియు నేలలో ఉన్న శిలింధ్రాలు నాశనం చేయబడతాయి.
ఉల్లిపంట వేయాలనుకునే రైతులు ముందుగా నారుమడులు సిద్ధం చేసుకుని ఉల్లినారు పెంచుకోవాలి. నారు మడుల పెంచుకునేందుకు రెండు రకాల పద్దతులు ఉన్నాయి.