Home » Paddy Nursery
Paddy Rice Cultivation : విత్తు కొద్దీ పంట అన్నట్లు విత్తనం నాణ్యంగా ఉంటేనే పంట బాగా పండుతుంది. మంచి దిగుబడులు అందిస్తుంది.
నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు, వరిలో అధిక దిగుబడికి సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్టనారుమళ్ల పెంపకం చేపడుతుండగా, అధికశాతం మంది రైతులు దంప నారుమళ్లు పోస్తున్నారు .
సెంటు నారుమడిలో ఐదు కిలోల విత్తనాలు మాత్రమే చల్లాలి. విత్తన మోతాదు ఎక్కువైతే నారు బలహీనంగా పెరుగుతుంది. తక్కువైతే పీకే సమయంలో నారు మొ క్కలు తేలికగా రావు. వేర్లు తెగిపోతాయి. నాటిన తర్వాత మూన తిరగడం ఆలస్యమవుతుంది.
వానాకాలం వరి సాగుకు రైతులు సిద్దమవుతున్నారు. మఖ్యంగా వరిసాగు చేసే రైతులు ఇప్పటికే నారుమళ్లు పోసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నారు పోసుకునేందుకు సిద్దమవుతున్నారు. అయితే వరిసాగులో నారుమడి యాజమాన్యం చాలా కీలకం.