Paddy Nursery : తెలుగు రాష్ట్రాల్లో వరి నారుమడులు పోస్తున్న రైతులు..

Paddy Rice Cultivation : విత్తు కొద్దీ పంట అన్నట్లు విత్తనం నాణ్యంగా ఉంటేనే పంట బాగా పండుతుంది. మంచి దిగుబడులు అందిస్తుంది.

Paddy Nursery : తెలుగు రాష్ట్రాల్లో వరి నారుమడులు పోస్తున్న రైతులు..

Paddy Nursery

Paddy Nursery : రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రైతులు  వరి నారుమడులు పోసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల అందుకు సమాయత్తమవుతున్నారు. విత్తు కొద్దీ పంట అన్నట్లు విత్తనం నాణ్యంగా ఉంటేనే పంట బాగా పండుతుంది. మంచి దిగుబడులు అందిస్తుంది. ఇందుకోసం నారుమడి దశనుంచే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు.. వరిలో అధిక దిగుబడికి  సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు నారుమళ్ల  పెంపకం చేపడుతున్నారు. మరి దృఢమైన నారు పుష్ఠిగా పెరిగి, 25 నుండి 30 రోజుల్లో అందిరావాలంటే .. నారుమడిలో మేలైన యాజమాన్యాన్ని చేపట్టాలి. ముఖ్యంగా విత్తనశుద్ది, పోషక యాజమాన్యం తప్పనిసరిగా చేయాలి. సకాలంలో నీటితడులను అందించాలి.

అంతే కాదు నీరు పెట్టడానికి, నీటిని బయటికి పంపడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. విత్తనాలు చల్లే ముందు ఒకసారి, చల్లిన 12 నుండి 16 రోజులకు మరోసారి ప్రతి ఐదు సెంట్ల నారుమడిలో కిలో చొప్పున నత్రజనిని అందించే ఎరువు వేయాలి. నారు పీకడానికి ముందు నత్రజని ఎరువు వేయకూడదు. చివరి దమ్ములో భాస్వ రం, పొటాష్‌లను అందించే ఎరువుల్ని కిలో చొప్పున వేయాలి.

సెంటు నారుమడిలో ఐదు కిలోల విత్తనాలు మాత్రమే చల్లాలి. విత్తన మోతాదు ఎక్కువైతే నారు బలహీనంగా పెరుగుతుంది. తక్కువైతే పీకే సమయంలో నారు మొ క్కలు తేలికగా రావు. వేర్లు తెగిపోతాయి. నాటిన తర్వాత మూన తిరగడం ఆలస్యమవుతుంది. అంతే కాదు నారుమడికి చీడపీడల ఉధృతి కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు