Home » Pests in Rice
Pests in Rice : ప్రస్తుతం పిలక దశలో ఉంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల తెగుళ్లు ఆశించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే చాలా చోట్ల అగ్గితెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఉండే వాతావరణ పరిస్థితులు వరిలో చీడపీడలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్థుతం వరిలో ఆకుముడత పురుగు, సుడిదోమ, పాముపొడ తెగులు సోకి పంటకు తీవ్రనష్టం చేస్తోంది.
మబ్బులతో కూడిన వాతావరణం ఉండటం వలన చాలా చోట్ల బ్యాక్టీరియా ఎండాకు తెగులు, అగ్గితెగులు, మెడవిరుపు, పాముపుడ, తెగుళ్లు సోకేందుకు అవకాశం ఉంది .
ఈ గుడ్లపై, తన రెక్కల నూగును కప్పివుంచుతుంది. 5-9రోజుల్లో ఈ గుడ్లనుంచి పిల్లపురుగులు బయటకు వచ్చి మొక్కల మొదళ్లకు చేరి లేత కాండాలకు రంధ్రాలుచేసి లోపలి కణజాలాన్ని కొరికి తినేసి తీవ్ర నష్టం కలుగు జేస్తుంది.
ఈ తెగుళ్ల వల్ల ఆకులపై నూలుకండె ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఉదృతి ఎక్కువైతే మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పైరు కాలిపోయినట్లు కనిపిస్తుంది. కంకిదశలో వెన్నులో మెడ విరిగి తాలు గింజలు ఏర్పడతాయి. దీనివల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది..