Pest Management in Paddy : వరిలో చీడపీడల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఉండే వాతావరణ పరిస్థితులు వరిలో చీడపీడలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్థుతం వరిలో ఆకుముడత పురుగు, సుడిదోమ, పాముపొడ తెగులు సోకి పంటకు తీవ్రనష్టం చేస్తోంది.

Paddy
Pest Management in Paddy : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వరి అంకురం ఏర్పడే దశ నుంచి గింజలు పాలుపోసుకునే దశ వరకు వుంది. ఇటీవల కురిసిన వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కృష్ణా జిల్లావ్యాప్తంగా ఆకుముడత, సుడిదోమ, పాముపొడ తెగులు ఆశించింది. రైతులకు అధిక మొత్తంలో రసాయన మందులు పిచికారి చేసినా.. అదుపులోకి రావడంలేదు. అయితే వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఉంగుటూరు ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డా. నంద కిషోర్.
READ ALSO : Black gram and Green gram Cultivation : వరి మాగాణుల్లో.. సాగుచేయాల్సిన పెసర, మినుము రకాలు
ప్రస్తుతం వరిపైరు వివిధ దశల్లో ఉంది. సెప్టెంబర్ నుండి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పంటలో చీడపీడల తాకిడి ఎక్కువైంది. ఒకదానివెనుక మరొకటి దాడిచేస్తూ రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధిక ఖర్చులు చేసి ఎన్ని రసాయన మందులు పిచికారి చేసినా వాటిని అదుపుచేయలేకపోతున్నామని వాపోతున్నారు.
READ ALSO : Maize Cultivation : వరిమాగాణుల్లో మొక్కజొన్న సాగు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం
అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఉండే వాతావరణ పరిస్థితులు వరిలో చీడపీడలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్థుతం వరిలో ఆకుముడత పురుగు, సుడిదోమ, పాముపొడ తెగులు సోకి పంటకు తీవ్రనష్టం చేస్తోంది. నత్రజని ఎరువులను ఎక్కువ మోతాదులో వాడటం, పొలం చుట్టూ నీడ ప్రదేశాలు ఉండటం వల్ల ఆకుముడత పురుగు ఉధృతికి కారణమైంది. ఆకుముడతను నాము పురుగు, తెల్లతెగులు అనిపిలుస్తారు. ఈ చీడపీడల నుండి పంటను కాపాడుకునేందుకు రైతులు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా , ఉంగుటూరు ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డా. నంద కిషోర్.