Black gram and Green gram Cultivation : వరి మాగాణుల్లో.. సాగుచేయాల్సిన పెసర, మినుము రకాలు
పెసర దాదాపు లక్ష హెక్టార్లలో సాగవుతుంది. వివిధ ప్రాంతాల్లో ఆయా సమయానికి అనువైన రకాలను రైతులు ఎన్నుకోవాలి. పెసరలో ఏడాది పొడవున వేసుకునే రకాలు కూడా ఉన్నాయి.

Black gram and Green gram Cultivation
Black gram and Green gram Cultivation : వరి మాగాణుల్లో రబీ మినుము, పెసర పంటలు వేసేందుకు ఇది మంచి సమయం. వరి తదితర ప్రధాన ఆహార పంటలతో పోల్చి చూస్తే.. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వినియోగంతో, స్వల్పకాలంలో చేతి కొచ్చే పంటలు అపరాలు. పల్లాకు వైరస్ తెగులును తట్టుకునే రకాలను ఎంపిక చేసుకుని, సాగులో మేలైన యాజమాన్యం పాటిస్తే ఈ పంటలు ఎప్పుడూ లాభదాయకమే. ప్రస్థుతం అంతర్జాతీయంగా అపరాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో వరి మాగాణుల్లో మినుము సేద్యం గురించి గుంటూరు లాం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రైతులకు సూచనలిస్తున్నారు..
READ ALSO : Prevention Of Pests : మినుము, పెసర పంటలో చీడపీడల నివారణ!
రబీకాలంలో మినుమును , పెసరను వరి మాగాణుల్లో పండించడం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత. దాదాపు 6 లక్షల హెక్టార్లలో మాగాణుల్లో మినుము, పెసర సాగవుతుంటుంది. వరి కోయడానికి 2 -3 రోజుల ముందుగా మినుము, పెసర విత్తనాన్ని వెదజల్లుతారు. ఈ విధంగా చల్లిని విత్తన౦ మొలిచి భూమిలోని మిగిలిన తేమని, సారాన్నిఉపయోగించుకొని పెరిగి పంట కొతకు వస్తు౦ది.
వరిని కోసిన తరువాత వరిమాగాణుల్లో అపరాల పంటగా మినుమును సాగుచేస్తుంటారు. దాదాపు 3 లక్షల హెక్టార్లలో వరిమాగాణుల్లో మినుము సాగవుతుంటుంది. మినుము నవంబర్ 15 నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు అన్ని రకాలను వేసుకోవచ్చు. అయితే డిసెంబర్ మొదటి వారం నుంచి చివరి వరకు కొన్ని రకాలను మాత్రమే శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ పంటల్లో విత్తనం ఎంపిక, శుద్ధి, ఎరువుల యాజమాన్యం, చీడపీడల నివారణకు తగిన చర్యలు తీసుకుంటే మంచి దిగుబడులు వస్తాయంటున్నారు గుంటూరు లాం వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త , డా. ఎన్ . వి. రమణ.
READ ALSO : Black Gram Cultivation : అధిక దిగుబడులకోసం ఖరీఫ్ మినుములో మేలైన యాజమాన్యం
పెసర దాదాపు లక్ష హెక్టార్లలో సాగవుతుంది. వివిధ ప్రాంతాల్లో ఆయా సమయానికి అనువైన రకాలను రైతులు ఎన్నుకోవాలి. పెసరలో ఏడాది పొడవున వేసుకునే రకాలు కూడా ఉన్నాయి. నేల, విత్తనం ద్వార వచ్చే తెగుళ్లను అరికట్టాలంటే విత్తనశుద్ధి తప్పనిసరిగా చేయాలంటున్నారు శాస్త్రవేత్త.
వరినాట్లు ఆలస్యమై, కొత జనవరిలో వచ్చినట్లైతే ఆ ప్రాంతంలో కొన్ని రకాలు మాత్రమే అనుకూలమైనవి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. వరిమాగాణుల్లో కలుపు సమస్య ఎక్కువ వుంటుంది. చీడపీడలకు ఆశ్రయాన్నిచ్చే కలుపును సమర్ధవంతంగా అరికడితే మున్ముందు సమస్యలు తగ్గుతాయి.
READ ALSO : Intercropping In Coconut : కొబ్బరిలో దోస, సొర, మినుము పంటల సాగు.. అంతర పంటలతో అదనపు ఆదాయం
వరి మాగాణుల్లో విత్తిన 30 రోజులకు భూమిలో వున్న తేమ పెసర మినుము పంటలకు సరిపోతుంది. కనీసం ఒక్క వర్షం పడినా పంట చేతికి వస్తుంది. నీటి ఎద్దడి వున్న పరిస్థితుల్లో కాయ తయారయ్యే సమయంలో ఒక నీటితడి ఇస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఈ పంటల్లో రైతులు ఎకరాకు 6 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడిని నమోదుచేస్తున్నారు.